‘గ్రేటర్‌’ ఎన్నికలు : బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లు వీరే | GHMC Elections 2020: BJP Released Star Campaigners List | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్‌’ ఎన్నికలు : బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లు వీరే

Published Thu, Nov 19 2020 8:07 PM | Last Updated on Thu, Nov 19 2020 8:23 PM

GHMC Elections 2020: BJP Released Star Campaigners List - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రచారానికి బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లను ప్రకటించింది. మొత్తం పది మందిని స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రకటిస్తూ ఎన్నికల అధికారికి జాబితాను అందించింది. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి కిషన్‌ రెడ్డి మినహా ఇతర కేంద్ర మంత్రులు రానట్లుగా తెలుస్తోంది. 

బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా

  1. బండి సంజయ్‌ ( రాష్ట్ర అధ్యక్షుడు)
  2. కిషన్‌ రెడ్డి (కేంద్ర మంత్రి)
  3. డీకే అరుణ
  4. లక్ష్మణ్‌
  5. మురళీదర్‌ రావు
  6. వివేక్‌
  7. గరికపాటి మోహన్‌రావు
  8. రాజాసింగ్‌(గోషామాల్‌ ఎమ్మెల్యే)
  9. ధర్మపురి అరవింద్‌
  10. రఘునందన్‌రావు (దుబ్బాక ఎమ్మెల్యే)

బీజేపీలోకి ఇద్దరు సిట్టింగ్‌ కార్పొరేటర్లు
‘గ్రేటర్‌’ ఎన్నికల్లో బీజేపీ ఆచూ తూచి వ్యవహరిస్తోంది. మొత్తం అభ్యర్థులను ప్రకటించకుండా.. ఇతర పార్టీల అసంతృప్తుల కోసం ఎదురు చూస్తోంది. బలమైన నాయకులను పార్టీలో చేర్చుకొని వారిని ఎన్నికల బరిలోకి దించనుంది. తాజాగా ఇద్దరు సిట్టింగ్‌ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. రామచంద్రపురం సిట్టింగ్‌ కార్పొరేటర్‌ అంజయ్య యాదవ్‌, వెంగల్‌రావునగర్‌ సిట్టింగ్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ మనోహర్‌ కాషాయం తీర్థం పుచ్చుకున్నారు.  మనోహర్‌, గతంలో జీహెచ్‌ఎంసీ వాట్సాప్‌ గ్రూప్‌లో అభ్యంతకర వీడియోలు పెట్టి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అతనికి టీఆర్‌ఎస్‌ సీటు లభించకపోవడంతో బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ అతనికి వెంగల్‌రావ్‌నగర్‌ టిక్కెట్‌ ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement