
సాక్షి, అమరావతి: విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంస్కరణలు చేపట్టారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఓట్లు లేకపోయినా విద్యార్థులకు అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. పథకాలను పక్కదోవ పట్టించడానికే బాబు.. లోకేష్‌ను పంపి హైడ్రామా చేయించాడని మండిపడ్డారు.
దళిత మహిళ చనిపోతే లోకేష్ శవ రాజకీయాలు చేశాడని దుయ్యబట్టారు. ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదో ప్రశ్నించాలన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ సీఎంకు సవాల్ విసరడమేంటని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఘటన జరిగిన 12 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారని.. దిశా చట్టం తెచ్చి మహిళలకు రక్షణ కల్పిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment