‘తెలంగాణకు ఏం చేశారో చెప్పే దమ్ముందా.. సవాల్ చేస్తున్నా’ | Minister KTR Commnets On PM Narendra Modi | Sakshi
Sakshi News home page

‘తెలంగాణకు ఏం చేశారో చెప్పే దమ్ముందా.. సవాల్ చేస్తున్నా’

Published Wed, Feb 16 2022 3:27 PM | Last Updated on Wed, Feb 16 2022 4:15 PM

Minister KTR Commnets On PM Narendra Modi - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: తెలంగాణ కోసం ఏం అడిగినా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. వర్ని మండలంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం, పాలమూరుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు.

చదవండి: సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలకు కౌంటర్​.. రుణపడి ఉండాలన్న కేంద్రం

కుల,మతాలకు అతీతంగా టీఆర్‌ఎస్‌ అభివృద్ధి చేస్తోంది. కానీ కొందరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. విషం నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణకు కేంద్రం ఏం చేశారో చెప్పే దమ్ముందా.. నేను సవాల్ చేస్తున్నా ఇలా అడిగితే ఇష్ట మొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పక్కనే కర్ణాటకకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చిన మోదీ.. తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరుకు అడిగితే ఇవ్వలేదు. గిరిజన రిజర్వేషన్లు పెంచమంటే నాలుగేళ్లయినా దున్నపోతు మీద వాన పడ్డ చందంగా ఉంది. ఏం అడిగినా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదు. ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతానికి మాత్రమే మోదీ ప్రధాని అనుకుంటా’’ అంటూ మంత్రి కేటీఆర్‌ దుయ్యబట్టారు.

ఉత్తరప్రదేశ్, ఉత్తర భారతానికి మాత్రమే మోదీ ప్రధాని అనుకుంటా. డబ్బుల రాళ్లేసి ఊపుడు తప్ప ఏం చెయ్యడం లేదు. గిరిజనులకు, రైతులకు, దళితులకు కేటాయింపు లు లేవు. దేశం కోసం ధర్మం కోసం అంటారు తప్ప దేశానికి ఏం చేస్తారో చెప్పరు. ఎల్‌ఐసీకి రైతు బీమా అవకాశం మనం ఇస్తే.. మోదీ మాత్రం ప్రైవేట్ పరం చెయ్యాలని చూస్తున్నారు. మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ, ఆంధ్రను కలుపుతారంటూ’’ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement