సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్ పద్దులపై చర్చల్లో సింగరేణిపై ఈటల చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి గనులు ఎందుకివ్వరో కేంద్రాన్ని నిలదీయాలంటూ ఈటల రాజేందర్‌కు మంత్రి చురకలంటించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్ట్రేలియా, ఇండోనేషియా వెళ్తే.. వాళ్ల ఫ్రెండ్‌కు గనులు వస్తాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్ముతుంది కేంద్రం కాదా అని ప్రశ్నించారు. ఏ కారణంతో అమ్మాల్సి వస్తుందని నిలదీశారు. సింగరేణి విషయంలో కూడా ఇదే వైఖరిలో కేంద్రం ఉందన్నారు. గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు గనులు నామినేషన్ బేసిస్ ఇస్తరు కానీ.. తెలంగాణ సింగరేణికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఈటలకు అంతా చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రాన్ని నిలదీసి అడగాలని సవాల్ విసిరారు. ఒకరి కోసం దోస్తుల కోసం పనిచేసే ప్రభుత్వం ఇక్కడ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలా ఒక వ్యక్తినే పల్లకిలో తమ సర్కార్ మోయదని స్పష్టం చేశారు. తమ పార్టీ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
చదవండి: ప్రగతిభవన్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్.. అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment