
సాక్షి, విశాఖపట్నం: కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన మాటను కచ్చితంగా నెరవేర్చే తత్వం సీఎం జగన్‌దన్నారు. సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక టీడీపీ తప్పుడు విమర్శలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు. (చదవండి: ఈ పాపం టీడీపీదే)
‘‘రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చాం. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నాం. కట్టుకథలు చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. రైతులను మోసం చేసింది చంద్రబాబే. ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తామంటే కేసులు వేసి అడ్డుపడతారు.దేశం మొత్తం కరెంటు కష్టాలు ఉన్నాయి. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర చంద్రబాబుదని’’ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు.
చదవండి:
రిటైరయ్యే వయస్సు.. పాడుబుద్ధి పోనిచ్చుకోలేదు
Comments
Please login to add a commentAdd a comment