సీఎం రేవంత్‌పై కేసు నమోదు చేయాలి.. కోర్టుకు వెళ్తాం: కవిత ఫైర్‌ | MLC Kavitha Serious Comments Over CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌పై కేసు నమోదు చేయాలి.. కోర్టుకు వెళ్తాం: ఎమ్మెల్సీ కవిత ఫైర్‌

Published Tue, Feb 6 2024 10:13 AM | Last Updated on Tue, Feb 6 2024 10:58 AM

MLC Kavitha Serious Comments Over CM Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పొలిటికల్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇక, ఈ వ్యవహారం కేసులు పెట్టే వరకు వెళ్లింది. తాజాగా సీఎం రేవంత్‌పై ఎ‍మ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌ వేదికగా..‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలి. సీఎం రేవంత్‌పై పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్‌పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంభించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తోంది. 

తెలంగాణలో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తోంది. సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయం రేవంత్ రెడ్డి మర్చిపోవద్దు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement