రేవంత్‌ Vs కవిత.. మాటల వార్‌తో దద్దరిల్లిన ట్విట్టర్‌ | Political Words Exchange Between Revanth Reddy And MLC Kavitha - Sakshi
Sakshi News home page

రేవంత్‌ Vs కవిత.. మాటల వార్‌తో దద్దరిల్లిన ట్విట్టర్‌

Published Sat, Sep 2 2023 2:44 PM | Last Updated on Sat, Sep 2 2023 3:59 PM

Political Words Exchange Between Revanth Reddy And MLC Kavitha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార పార్టీ నేతలు సహా ప్రతిపక్ష నేతలు పొలిటికల్‌గా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్‌ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. 

రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ బీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ట్విట్టర్‌లో‘గల్లీలో సవాల్లు.. ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోల్లు.. ఇది కేసీఆర్ మ్యాజిక్కు.. జగమెరిగిన 'నిక్కర్'.. లిక్కర్.. లాజిక్కు’ అంటూ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. 

ఇక, రేవంత్‌ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. ట్విట్టర్‌ వేదికగా కవిత..‘అప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం.. ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం.. అంటూ డీకే శివకుమార్‌తో​ రేవంత్‌ భేటీ అయిన ఫొటోను పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య ట్విట్టర్‌ వార్‌ నడుస్తోంది. 

ఇది కూడా చదవండి: ఖమ్మం రాజకీయాల్లో ఊహించని పరిణామం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement