
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్ కారణంగా వాయిదాపడిన నిజామా బాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చేనెల 9న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) వెల్లడించింది. అక్టోబర్ 12న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొంది. ఈ నియో జకవర్గ పరిధిలో తక్షణం ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆర్.భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా అనర్హతకు గురవగా సీఈసీ మార్చి 5న ఉపఎన్నికకు షెడ్యూలు జారీచేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం పోటీలో మిగిలిన అభ్యర్థులను కూడా ఎన్నికల సంఘం ప్రకటిం చింది. ఏప్రిల్ 7న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా..కోవిడ్ కారణంగా తొలుత 60 రోజుల పాటు ఎన్నిక వాయిదావేస్తూ ఎన్నికల సంఘం మార్చి 24న ఉత్తర్వులు జారీచేసింది. తదనంతరం 45 రోజులపాటు పొడిగిస్తూ మే 22న, తిరిగి జూలై 6న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment