సాక్షి, ఢిల్లీ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవకాశవాది అని విమర్శించారు. చంద్రబాబు కోసం తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా తన సొంత ఎన్నికలు వదులుకొని ఏపీకీ ప్రచారానికి వెళ్లారని గుర్తుచేశారు. ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్లీన్‌స్వీప్ చేస్తారని తెలిసినా తన తండ్రి బాబు తరపున ప్రచారం చేయడానికి వెళ్లారన్నారు. బాబు ఓడిపోతున్నారన్న విషయం ఆయనకు తప్ప అందరికి తెలుసన్నారు. కానీ తాము హౌజ్ అరెస్ట్‌లో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు కనీసం ఒక్క మాట మాట్లాడకపోగా కనీస మద్దతుగా ఒక ప్రకటన కూడా చేయలలేకపోయారన్నారు. అందుకే చంద్రబాబు నమ్మదగిన నేత కాదంటూ అబ్దుల్లా మండిపడ్డారు.(‘వేల ఏళ్లుగా ఉన్న రామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారు’)
ఒమర్ అబ్దుల్లా మార్చి నెలలో నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పబ్లిక్ సేఫ్టీచట్టం కింద ఆయనను 8నెలల కింద గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. 370 అధికరణ కింద జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన అనంతరం గతేడాది ఆగస్టు 5 నుంచి ఆయన ఆ రాష్ట్ర గెస్ట్ హౌస్ హరినివాస్‌లో ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కూడా 221 రోజుల నిర్బంధం నుంచి ఈ ఏడాది మార్చి 13న విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment