సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియాపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. ఏదో విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతి బరితెగించి వార్తలు రాస్తున్నాయి. కక్షపూరితంగా సీఎం జగన్‌ను అపఖ్యాతిపాలు చేయాలని చూస్తున్నారు. సీఎం జగన్‌పై దాడి ఘటనలో తప్పుడు వార్తలు రాస్తున్నారు. హత్యాయత్నం జరిగిందని ఎన్‌ఐఏ, పోలీసులు కూడా ఒప్పుకున్నారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసింది మా పార్టీ వ్యక్తే అని హడావిడిగా దాడి జరిగిన గంట వ్యవధిలోనే అప్పట్లో డీజీపీ చెప్పేశారు. దాడి జరిగిన తర్వాత కనీసం పరామర్శించకుండా విమర్శలు చేశారు. దాడి ఘటనపై ఇష్టానుసారం తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఎన్టీఆర్‌పై దాడి జరిగితేనే ఈనాడుకు పెద్దవార్త. సీఎం జగన్ కావాలని చేయించుకుంటున్నారంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు.
చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు మహానేత వైఎస్‌ఆర్ ఖండించారు. పటిష్ట భద్రత ఉన్న ఎయిర్‌పోర్టులోపలికి కత్తి ఎలా వచ్చింది?. హత్యాయత్నం వెనుక ఎవరు ఉన్నారనే దానిపై వెల్లడించాలని అప్పట్లో వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. ఘటనపై విచారణ జరపాలని కోరడం తప్పా?. విశాఖ పోలీసులను ఎవరు ప్రభావితం చేశారు?. ఎయిర్‌పోర్టు అధికారులను ఎవరు ప్రభావితం చేశారు?. నిందితుడి గురించి విచారించకుండానే స్టేట్‌మెంట్లు ఇచ్చారు అని తెలిపారు.
అయితే, అలిపిరి ఘటన కూడా డ్రామానా చంద్రబాబు?. తీవ్రవాదులకు స్లీపర్ సెల్స్ ఎలా ఉంటారో చంద్రబాబుకు కూడా కొన్ని వ్యవస్థల్లో స్లీపర్ సెల్స్ ఉన్నారు. డీఎల్ రవీంద్రరెడ్డి లాంటి నీచ వ్యక్తులతో మాట్లాడించి టీవీలో వేస్తున్నారు. గరుడపురాణం పేరుతో సినీనటుడు శివాజీతో ఎవరు మాట్లాడించారో కూడా విచారణ జరపాలి. టీడీపీ కార్యకర్తలు ఏదో మిషన్‌తో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తున్నారు. చంద్రబాబు నైజం ప్రజలకు ఆశ చూపటం, వంచించటం, ఓట్లు పొందటం. ఎల్లోమీడియాలో ఎన్ని తప్పుడు వార్తలు రాసినా జనం నమ్మటం లేదు అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment