
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని సీపీఎం, సీపీఐ భావిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతామని, తమ బలాన్ని పెంచుకుంటామని చెప్పా రు. బీజేపీ తప్పుడు పద్ధతుల్లో రాష్ట్రంలో ఎదిగేందుకు, అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
వామపక్ష భావజాలం బలంగా ఉన్న, సాయుధ పోరాటం జరిగిన తెలంగాణలో బీజేపీ అడుగుపెట్టాలనుకోవడం దుస్సాహసమేనని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ ఐకమత్యంతో వ్యవహరించాలని, రాబో యే ఎన్నికల్లో వీలైతే బీఆర్‌ఎస్‌తో సీట్ల సర్దుబాటు పొత్తు కుదుర్చుకుంటామని చెప్పారు. 2024 ఎన్నికల్లో పొరపాటున బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం విచ్చి న్నంకాక తప్పదన్నారు.
బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే క్రమంలోనే తెలంగాణలో తాము ఏకమయ్యామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆ రెండు పార్టీ ల నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, చెరుపల్లి సీతారాములు, జాన్‌వెస్లీ సమావేశమయ్యారు. అనంతరం తమ్మినేని, కూనంనేని మీడియాతో మాట్లాడారు.
షర్మిల తీరు హాస్యాస్పదం: కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగస్వామి అయితే ఆమెను విచారించడాన్ని, శిక్ష విధించడాన్ని తమ పార్టీ లు సమర్థిస్తాయని తమ్మినేని అన్నారు. అయితే కవితపై పెడుతున్న కేసులు ప్రతిపక్షాలను లొంగ తీసుకునేందుకు ఆడుతున్న నాటకాలు తప్ప వాటిల్లో వాస్తవం లేదన్నారు. అదానీ దోపిడీకి వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, పోరాటాలు చేయాలని షర్మిలకు ఎందుకు గుర్తు రాలేదని తమ్మినేని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకతీతంగా విపక్షాలు కలిసి మాట్లాడుకోవాలనడం హాస్యాస్పదమని విమర్శించారు.
మంచైనా, చెడైనా కలిసే ముందుకు..
తాము అన్నదమ్ముల్లా ఉన్నామని, మంచైనా, చెడైనా ఇక కలిసే ముందుకు నడుస్తామని కూనంనేని స్పష్టం చేశారు. తమ రెండు పార్టీలు కలిస్తే 40 నుంచి 50 నియోజకవర్గాల్లో అభ్యర్థి ని గెలిపించే, ఓడించే శక్తి ఉంటుందని అన్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల మధ్య మరింత ఐక్యత దిశగా ఈ నెల 9న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సీపీఐ, సీపీఎంల ఉమ్మడి సభ జరుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment