బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపిక బాధ్యత అధిష్టానానికే.. | Responsibility of selecting BJP Legislative Party Leader under High Command | Sakshi
Sakshi News home page

బీజేపీ శాసనసభా పక్ష నేత ఎంపిక బాధ్యత అధిష్టానానికే..

Published Wed, Jun 12 2024 6:09 AM | Last Updated on Wed, Jun 12 2024 6:09 AM

Responsibility of selecting BJP Legislative Party Leader under High Command

సాక్షి, అమరావతి: బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిని ఎంపిక చేసే బాధ్యతను ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ అధిష్టానానికి అప్ప­గించారు. బీజేపీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు మంగళవారం విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాసనసభా పక్ష నేత ఎంపికపై చర్చించారు. చివరకు శాసనసభా పక్ష నేత ఎంపికపై నిర్ణయం తీసుకునే అధికారం బీజేపీ అధిష్టానానికే అప్పగిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement