Minister Roja Political Satire On AP BJP Chief Daggubati Purandeswari - Sakshi
Sakshi News home page

ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరిపై మంత్రి రోజా సెటైర్లు

Published Sat, Jul 29 2023 1:08 PM | Last Updated on Sat, Jul 29 2023 1:51 PM

Roja Political Satire On AP BJP Chief Daggubati Purandeswari - Sakshi

సాక్షి, తిరుపతి: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై మంత్రి రోజా సీరియస్‌ అయ్యారు. పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలా? లేక టీడీపీ అధ్యక్షురాలా? అనే సందేహం వస్తోందన్నారు. అలాగే, పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టింది ప్యాకేజీల కోసమేనని ఫైరయ్యారు. 

కాగా, మంత్రి రోజా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యం ఉంటే రాష్ట్రంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు. పవన్‌ కల్యాణ్‌ పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. చంద్రబాబును సీఎం చేయడమే పవన్‌ ధ్యేయం. పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షురాలా? అనే సందేహం వస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడితే పురంధేశ్వరి కూడా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని చంద్రబాబు నుంచి నందమూరి కుటుంబం తీసుకోవాలి. ఏపీ అప్పుల్లో ఉందని పురంధేశ్వరి అనడం హాస్యాస్పదం. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు తక్కువ అని కేంద్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

టీడీపీ హయాంలోనే తలకుమించిన అప్పులు చేశారు. ఓ మ్యాప్‌ తీసుకుని చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో గాడిదలు కాశారా?. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ధి గుర్తుకురాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు అభివృద్ధి గుర్తుకువస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో నదులు అనుసంధానం కన్నా నిధుల అనుసంధానం చేయడంలోనే ఎక్కువ దృష్టి పెట్టారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

ఇది కూడా చదవండి: అమాయక అబలలపై కన్నేసి.. నారాయణ వేధింపుల పర్వంపై విజయసాయిరెడ్డి స్పందన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement