TDP Senior Leader Buddana Sri Rama Rao Resigns To TDP In West Godavari - Sakshi
Sakshi News home page

West Godavari: టీడీపీకి షాక్‌.. సీనియర్‌ నేత రాజీనామా

Published Fri, Dec 2 2022 7:54 AM | Last Updated on Fri, Dec 2 2022 2:36 PM

TDP Leader Buddana Srirama Rao Resigns In West Godavari - Sakshi

రాజీనామా పత్రాన్ని చూపుతున్న బుద్దన

పెంటపాడు(పశ్చిమగోదావరి జిల్లా): ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు తాడేపల్లిగూడెం పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆ పార్టీకి షాక్‌ తగిలింది. సుదీర్ఘకాలం టీడీపీకి సేవ చేసిన ముదునూరు మాజీ సర్పంచ్‌ బుద్దన శ్రీరామారావు (బాబులు), ఆయన భార్య, మాజీ సర్పంచ్‌ శారదలీలాపద్మావతి పార్టీకి రాజీనామా చేశారు.

ఆయన స్వగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి తాను కృషిచేశానని, అయితే ప్రస్తుతం తెలుగుదేశం నాయకులు వేర్వేరుగా ఉండటం, పార్టీ తనను చిన్నచూపు చూడటంతో మనస్తాపం చెందానన్నారు. కష్టపడే వారికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. మండలంలో కీలక నేతగా ఉన్న బాబులు రాజీనామాతో పలువురు ఇదే దారిలో ఉన్నట్టు తెలిసింది.
చదవండి: చంద్రబాబు హైడ్రామా.. రొచ్చగొట్టే ప్రసంగాలతో.. విద్వేషాలు రగిల్చేలా..      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement