Breadcrumb
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Published Mon, Nov 13 2023 7:42 AM | Last Updated on Thu, Nov 23 2023 12:15 PM
Related Liveblog
Live Updates
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
రేపు 3 చోట్ల రేవంత్‌రెడ్డి సభలు
- రేపు స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, కామారెడ్డి నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ సభలు
2023-11-13 20:38:16
ఖమ్మం రూరల్ మండల ప్రచారంలోపొంగులేటి కామెంట్స్
- ఆరు దశాబ్దాల పోరాటం తో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది..
- తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఒకే కుటుంబం ఫలాలు అనుభవిస్తోంది
- బీజేపీ నాయకులను ప్రశ్నిస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుంటే ఎందుకు కేసీఆర్‌ను అరెస్ట్ చేయలేదు
- రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇన్కమ్ టాక్స్ పేరుతో నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు
- ఇదేనా మీ సంస్కృతి, ఇలానే ఉంటుందా ప్రజాస్వామ్యం
- కేసీఆర్ ను ఫామ్‌హౌజ్‌కే పరిమితం చెయ్యాలి
2023-11-13 20:22:23
ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై దాడి చేసిన యువకులపై కేసు
- మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్‌ను అయోధ్య పురం గ్రామానికిచెందిన ముగ్గురు యువకులు దళితబంధు కోసం నిలదీశారు
- ఎమ్మెల్యే శంకర్ నాయక్ కారు అద్దం దింపి వారి తో మాట్లాడుతుండగా హఠాత్తుగా దాడి చేశారు
- గన్మెన్లు ముగ్గురు యువకులను చితకబాది గూడూరు పోలీస్ స్టేషన్లో అప్పగించి వారి సెల్ ఫోన్లను లాక్కున్నారు
- విధులకు ఆటంకం కలిగించారని గన్‌మెన్ లక్ష్మణరావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు
- ముగ్గురు యువకులపై కేసు సమోచేసినట్లు ఎస్ఐ రాణ ప్రతాప్ తెలిపారు
2023-11-13 20:16:26
హరీష్‌రావు ఏనాడూ కేసీఆర్ మాట జవదాటడు
- బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుంది.. అది ఖాయం
- కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు
- కేసీఆర్‌పై నమ్మకం, మేం చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తాయి
- నాకు నేను ఎప్పుడూ ట్రబుల్ షూటర్ అని చెప్పుకోలేదు
- హరీష్‌రావు ఏనాడూ కేసీఆర్ మాట జవదాటడు
- నేను ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదు
- పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను పాటిస్తాను
- కర్ణాటక నుంచి డబ్బు, మద్యం సీసాలు వస్తున్నాయి
- సిద్ధరామయ్య, శివకుమార్‌ల చుట్టూ తిరిగి టికెట్లు తెచ్చుకుంటున్నారు
- అయినా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు
- మా ముఖ్యమంత్రి కేసీఆరే
- పదకొండుసార్లు కాంగ్రెస్‌కు అధికారం చేపట్టేందుకు అవకాశం ఇచ్చారు
- తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదు.. ప్రజలు లాక్కున్నారు
- రాష్ట్ర ఏర్పాటు ఐదేళ్లు ఆలస్యం చేసి.. మోసం చేసింది కాంగ్రెస్
- బీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శం
2023-11-13 20:07:56
డోర్నకల్ ఎమ్మెల్యే గెలుపు కోసం ప్రమాణం
- బీఆర్ఎస్ కార్యకర్తలతో రెడ్యా నాయక్ గెలుపు కోసం ప్రమాణం చేయించిన మండల ఉపాధ్యక్షుడు
- రెడ్యా నాయక్‌కు ఓటు వేసి గెలిపించాలని..కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిన
- డోర్నకల్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ నేతల తీరు
2023-11-13 19:48:35
కరీంనగర్లో బండి సంజయ్ కామెంట్స్
- గంగుల దమ్ముంటే బహిరంగ చర్చకు రా
- తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిధులు తెచ్చిందెవరో తేల్చుకుందాం రా
- పేదలకు రేషన్ బియ్యం ఇస్తోందెవరో చర్చిద్దాం రా
- నువ్వే పౌరసరఫరాల మంత్రివి కదా.. ఒక్క కొత్త రేషన్ కార్డు ఎందుకివ్వలే?
- కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను పొరపాటున గెలిపిస్తే... మీ ఇండ్లను కబ్జా చేస్తరు
- పేదల రక్తం తాగేందుకు వెనుకాడరు
- ప్రశ్నించే గొంతుకను పిసికి చంపాలని చూస్తున్నరు
- పొరపాటున గంగుల గెలిస్తే మీకు నరకం చూపిస్తరు
2023-11-13 19:31:34
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నామినేషన్ రిజెక్ట్
- నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి నామినేషన్ తిరస్కరణ
2023-11-13 18:47:30
మాణిక్ రావు ఠాక్రే కామెంట్స్..
- తెలంగాణ కోసం 1200 మంది ప్రాణత్యాగం చేశారు
- అమరుల కుటుంబాలను కేసీఆర్ కనీసం పట్టించుకోలేదు
- 60 శాతం బడ్జెట్ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉంది
- రాష్ట్రాన్ని విముక్తి చేయాల్సిన అవసరం ఉంది
2023-11-13 18:14:44
రేవంత్‌పై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
- సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన బీఆర్ఎస్ లీగల్ టీమ్
- ఎన్నికల ప్రచారం నుంచి రేవంత్‌ను తొలగించాలని ఫిర్యాదు
- రేవంత్ భాష సరిగా లేదని ఆరోపణ
- కాంగ్రెస్ యాడ్స్ బీఆర్ఎస్ను కించపరిచేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్న గులాబీ పార్టీ
2023-11-13 18:06:45
బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ
- నామినేషన్ల పరిశీలన లో బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ
- రాష్ట్ర వ్యాప్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్ రిజెక్ట్
- స్టేషన్ ఘనపూర్, ఆలేరు, పాలకుర్తి, మధిర, భువనగిరి, బహదూర్ పుర, జనగామ సెగ్మెంట్ల అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరించిన రిటర్నింగ్ అధికారులు
2023-11-13 17:54:26
నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కామెంట్స్
- పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల కక్ష కట్టింది
- మీరు తిప్పికొట్టి పెద్ది సుదర్శన్ రెడ్డిని గెలిపించాలి
- పార్టీల చరిత్రలు చూసి ఓటెయ్యండి
- ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పార్టీ కాంగ్రెస్
- ఓటు అంటే ఆషామాషీ కాదు.. తలరాతలు మార్చే గీత
- పాకాల ఆయకట్టుకు నీరందించింది ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డే
- గతంలో నర్సంపేటలో ఎవరూ చేయని అభివృద్ధిని పెద్ది సుదర్శన్ రెడ్డి చేశారు
- రాహుల్ గాంధీకి ఎవుసం అంటే తెలియదు కానీ ఆయన కూడా మాట్లాడుతున్నారు
- వరంగల్ వెళ్లాల్సిన మెడికల్ కాలేజీని పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటకు తీసుకొచ్చారు
- తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలి
2023-11-13 17:47:32
నారాయణపేటజిల్లా మద్దూర్‌లో రేవంత్‌రెడ్డి కామెంట్స్
- ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి మద్దూర్ చీమల దండుగా కదిలింది..
- మద్దూర్ లో 30 పడకల ఆసుపత్రి, జూనియర్ కాలేజ్ భవనం, పాఠశాల నిర్మించింది నా హయాంలోనే
- బీఆర్ఎస్ నాయకులు తమ ఊర్లని చెప్పుకునే గ్రామాలకు రోడ్లు వేయించింది మనమే
- మిమ్మల్ని కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటే మీరు నన్ను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు
- రూ.350కోట్లతో గ్రామ గ్రామాన తాగునీరు తెచ్చింది నేను
- బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు రాలే, రైల్వే లైన్ రాలే,డిగ్రీ కాలేజీ రాలే
- ఏమీ చేయని.. ఏమీ తేలేని బీఆరెస్ వాళ్లు సిగ్గులేకుండా వచ్చి ఓట్లు అడుగుతున్నారు
- బీఆర్ఎస్ను బొంద పెట్టి... ఇందిరమ్మ రాజ్యం తెచ్ఛుకుందాం
- ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు
2023-11-13 17:41:53
ధర్నాకు అనుమతి కోరిన కర్ణాటక రాజ్య రైతు సంఘం సభ్యులు
- హైదరాబాద్ సీఈఓ ఆఫీస్‌కు వచ్చిన కర్ణాటక, రాజ్య రైతు సంఘం సభ్యులు
- ఈ నెల 22వ తేదీన ఇందిరా పార్క్ ధర్నాకు అనుమతి ఇవ్వాలని సీఈఓ వికాస్‌రాజ్‌కు విజ్ఞప్తి దేశంలోని అన్ని జాతీయ పార్టీలు రైతులకు బోగస్ హామీ ఇస్తున్నందుకు నిరసనగా ధర్నా
- దేశంలో ఉన్న జాతీయ పార్టీలను రైతులు తిరస్కరించారు
- రైతులకు ఎంఎస్పీ కల్పించడంలో రెండు జాతీయ పార్టీలు విఫలం
- రైతులకు ఇచ్చే హామీలు జాతీయ పార్టీలు అమలు చేయడం లేదు
- ఇప్పటికే కర్ణాటక లో రైతులు జాతీయ పార్టీల వల్ల మోసపోయారు
- తెలంగాణ ప్రజలు మోసపోవద్దని ఇక్కడి రైతులకు అవగాహన కల్పించడానికి ధర్నా చేస్తాం
2023-11-13 16:56:23
పరిగి రోడ్ షోలో కేటీఆర్ కామెంట్స్
- నవంబర్ 30 నాడు గులాబీ జెండా పాతాలి
- మనం ఏమి చేశామో చెప్పి ఓట్లు అడగాలి
- కొత్తగా నాలుగు కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాము
- తెల్ల కార్డు ఉన్న 93 లక్షల కుటుంబాలకు ఐదు లక్షల జీవిత బీమా
- కేసీఆర్ భరోసా కింద మరెన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము
- హనుమంతుని గుడి లేని ఊరు లేదు..కేసీఆర్ సంక్షేమం అందని గడప లేదు
- 50 కంటే ఎక్కువ తండాలను ఇక్కడ గ్రామ పంచాయతీలను చేశాం
- 6 శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్‌ను 10 శాతం పెంచుకున్నం
- ప్రతి తండాలో సేవాలాల్ భవనం కట్టే బాధ్యత మాది
- ప్రతి గ్రామంలో మహిళా భవనం కట్టిస్తాం
- కొద్ది రోజుల్లోనే పాలమూరు రంగారెడ్డి నీరు ఇక్కడకు వస్తుంది
- పాలమూరు నీరు రాలేదు అని కాంగ్రెస్ వారు అంటే..వారిని అడగండి కేసులు ఎందుకు వేశారు అని
- కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్, నీరు ఎందుకు ఇవ్వలేదు
- హరీశ్వర్ రెడ్డి ఆత్మ శాంతించాలి అంటే మహేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
- ఒక్క కేసీఆర్‌ను కొట్టడం కోసం ఎంతో మంది వస్తున్నారు
- ఎంత మంది వచ్చినా భయం లేదు
- సింహం ఎప్పుడు సింగిల్‌గానే వస్తుంది
2023-11-13 16:44:30
ఏఐసీసీ ప్రతినిధి అజయ్ కామెంట్స్
- సీఈవో ఆఫీస్ నుంచి కాంగ్రెస్ పార్టీవి నాలుగు వీడియోలు నిలిపివేయాలని నోటీస్ వచ్చింది
- మేము ప్రచారం చేసే ప్రతి యాడ్‌కు అనుమతి తీసుకున్నాం
- యాడ్ బంద్ చేయడానికి మాకు డైరెక్ట్ నోటీస్ ఇవ్వకుండా టీవీ ప్రచారం తరువాత సీఈవో నుంచి లేఖ వచ్చింది.
- రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది పోలీసులు మా కాంగ్రెస్ అభ్యర్థులను, కార్యకర్తలను బెదిరిస్తున్నారు
- రాష్ట్రంలో పోలీసులు బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేస్తున్నారు
2023-11-13 16:35:58
రేవంత్‌రెడ్డి రోడ్ షోలో అనూహ్య ఘటన
- పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించిన రోడ్ షోలో అనుహ్య ఘటన జరిగింది
- వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి భార్య రేవంత్ రెడ్డి ప్రచార వాహనం పైకెక్కి కాంగ్రెస్ పార్టీ నేతలను నిలదీసింది
- దీంతో నేతలంతా అవాక్కయ్యారు
- తన ఇంటి వద్దనుంచి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు అనుచితంగా మాట్లాడారని ఆరోపిస్తూ వాహనం ఎక్కి నిలదీశారు
- మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి పొరపాటు జరిగింది క్షమించాలని చెప్పడంతో సమస్య సద్దుమనిగింది
2023-11-13 16:28:15
వికారాబాద్‌లో రేవంత్‌రెడ్డి కామెంట్స్
- డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, కాలేజీలు తెస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పిండ్రు
- పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చని నేతలు మళ్ళీ గెలిపించాలని మిమ్మల్ని అడుగుతున్నారు
- ఇక్కడ కట్టిన బడి, గుడి, తాగునీరు నేను తీసుకొచ్చినవే
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం
- మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తాం
- రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తాం
- రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు అందిస్తాం
- ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తాం
- గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం
- చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్ అందిస్తాం
- నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
- ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి
2023-11-13 16:24:00
ఒకేరోజు 4 సభలకు అమిత్ షా
- ఈనెల 17న తెలంగాణకు అమిత్ షా
- అదేరోజు బీజేపీ మేనిఫెస్టో విడుదల
- ఒకే రోజు 4 సభలకు హాజరుకానున్న అమిత్ షా
- నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌లో సభలు
2023-11-13 16:19:52
6 రోజులు తెలంగాణలోనే రాహుల్ గాంధీ
- ఈ నెల 17న తెలంగాణకు రాహుల్ గాంధీ
- 6 రోజులు తెలంగాణలోనే మకాం
- ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు విజయభేరి సభల్లో పాల్గొననున్న కాంగ్రెస్ అగ్రనేత
2023-11-13 15:49:45
బూర్గంపాడు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కామెంట్స్
- ఎన్నికలు వచ్చాయని ఆగం కావద్దు
- ఎన్నికల్లో మంచి చెడు ఆలోచించాలి
- అబద్ధపు హామీలు నమ్మొద్దు
- 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ
- అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ విధివిధానాలను పరిశీలించాలి
- తెలంగాణను అణచివేసింది కాంగ్రెస్సే
- 2006లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి ఉండాలి
- గతంలో కరెంట్ ఉండేది కాదు వలసలుండేవి
- బీఆర్ఎస్ తెలంగాణను క్రమ పద్ధతిలో అభివృద్ధి చేస్తోంది
- నీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం
- ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే
- రైతుబంధు డబ్బులు దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారు
- 24 గంటల కరెంట్ కావాలా.. 3 గంటల కరెంట్ కావాలా
- ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని కాంగ్రెసోళ్లు మాట్లుడుతున్నరు
- దళితుల్లో వెలుగు నింపేందుకు దళితబంధు తీసుకువచ్చాం
2023-11-13 15:38:52
సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాదసభ
- ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్
2023-11-13 15:34:57
రేవంత్‌రెడ్డి కార్నర్ మీటింగ్
- దౌల్తాబాద్ మండలంలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హాజరైన కార్యకర్తలు
2023-11-13 15:32:45
ఖమ్మంలో కూనంనేని కామెంట్స్
- కేసీఆర్ పాపం పండింది
- పాపంలో పాలు పంచుకున్న వారంతా భాద్యులవుతారు
- ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గెలుపు కోసం సీపీఐ శ్రేణులు ఐక్యం గా పనిచేయాలి
- పొత్తు ధర్మం కోసం కాంగ్రెస్ పార్టీకి సీపీఐ కట్టుబడి పనిచేయాలి
- మాకు వ్యక్తులు ముఖ్యం కాదు.. పార్టీ ముఖ్యం
- కొత్తగూడెంలో నా గెలుపు కోసం తుమ్మల ,పొంగులేటి ప్రచారం చేస్తున్నారు
- బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం ఖాయం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం
- సీపీఐ మద్దతుతో కాంగ్రెస్ 70 స్థానాల్లో విజయం సాధించబోతోంది
2023-11-13 15:28:46
బీఆర్ఎస్లోకి తుల ఉమ...కేటీఆర్ కామెంట్స్
- తుల ఉమక్కకు వేములవాడ బీజేపీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి బీఫాం ఇవ్వకుండా గుంజుకోవడం బాధాకరం
- ఇది మహిళల పట్లే కాకుండా బీసీల పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరికి నిదర్శనం
- తెలంగాణ ఆడ బిడ్డగా, బీఆర్ఎస్ ఇంటిబిడ్డగా తన సేవలందించిన తుల ఉమక్కను బీజేపీ ఇలా అవమానించడం బాధగా ఉంది
- బలహీన వర్గాల ఆడబిడ్డకు ఇంత అన్యాయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
- సీఎం కేసీఆర్ సూచన మేరకు స్వయంగా నేనే ఉమక్కకు ఫోన్ చేసి ఆహ్వానించిన
- నా ఆహ్వానాన్ని మన్నించి అక్క రావడం సంతోషం
- ఉమక్క కు గతంలో ఉన్న హోదా కంటే మరింత సమున్నత హోదాను, బాధ్యతలను అప్పగించి పార్టీ గౌరవించుకుంటుంది
2023-11-13 15:14:12
గులాబీ గూటికి తుల ఉమ
- బీఆర్ఎస్లో చేరిన తుల ఉమ
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్
2023-11-13 14:58:30
దమ్మపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కామెంట్స్
- తెలంగాణను అణచివేసిందే కాంగ్రెస్
- కాంగ్రెస్ పార్టీ 2006లోనే తెలంగాణ ఇచ్చి ఉండాలి
- కాంగ్రెస్ పాలనలో వలసలు, ఆత్మహత్యలు తప్ప ఏమీ ఉండవు
- ప్రజలు అబద్ధపు హామీలు నమ్మొద్దు
- ఓటు వేసే ముందు ఆలోచించండి
- అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూసి విచక్షణతో నిర్ణయం తీసుకోండి
- ధరణిని బంగాళాఖాతంలో వేయాలంటున్నరు
- 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు
- రైతు బంధు ఉండాలా వద్దా
- 24 గంటల కరెంటు కావాలా..3 గంటల కరెంటు కావాలా
- ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే
- కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారు
- ధరణితోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమవుతోంది
- రైతుబంధు పథకంతో డబ్బులు దుబారా అవుతున్నాయని మాట్లాడుతున్నారు
2023-11-13 14:44:52
వివాదంలో బీఆర్ఎస్ విజయుడు
- వివాదంలో ఆలంపూర్(జోగులాంబ గద్వాల్) బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు
- పుల్లూర్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేసిన విజయుడు
- ఉద్యోగానికి రాజీనామాపై స్పష్టత లేదంటున్న కాంగ్రెస్
- ఉద్యోగానికి విజయుడు రాజీనామా చేశాడంటున్న బీఆర్ఎస్
- కాంగ్రెస్ అభ్యంతరంలో అర్థం లేదంటున్న బీఆర్ఎస్
2023-11-13 14:07:03
పువ్వాడపై తుమ్మల ఫిర్యాదు
- ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్
- అభ్యర్థి పువ్వాడ ఆఫిడవిట్ ఈసీ నిర్దేశిత ఫార్మట్ లేదని ఆరోపణ
- రిటర్నింగ్ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన తుమ్మల
- ఫార్మెట్ మార్చడంపై తుమ్మల అభ్యంతరం
- రిటర్నింగ్ అధికారి తీరుపైనా అసంతృప్తి
- ఎన్నికల సంఘానికి, అలాగే న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తానన్న తుమ్మల
- అఫిడవిట్ లో డిపెండెంట్ కాలమ్ మార్చినట్లు తుమ్మల ఆరోపణ
- డిపెండెంట్ కాలమ్‌లో ఎవ్వరు లేకపోతే నిల్ రాయకుండా మార్చారు: తుమ్మల
- నాలుగు సెట్స్ నామినేషన్లు తప్పులు ఉన్నాయి: తుమ్మల
- నిర్దేశిత ఫార్మట్‌లో లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారి కోరాను: తుమ్మల
- ఆర్వో సైతం ఎన్నికల నిబంధనలు పాటించలేదు: తుమ్మల
- ఆర్వోపై న్యాయ పోరాటం చేస్తా:తుమ్మల
2023-11-13 13:59:35
పావని నామినేషన్ తిరస్కరణ
- జనతా కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన పావని
- కూకట్పల్లి సెగ్మెంట్లో నామినేషన్ వేసిన పావని
- పావని నామినేషన్ తిరస్కరించిన ఆర్వో.
- అభ్యర్థిని బలపరిచేందుకు కావాల్సిన పది మందిలో ఒకరి సంతకం లేదని రిజెక్ట్ చేసిన అధికారులు
- ఆర్వో కనీస సమాచారం ఇవ్వకుండా నామినేషన్ రిజెక్ట్ చేశారంటూ CEO ఆఫీస్‌కు వచ్చిన పావని
- ఇప్పుడు CEOను కలిసేందుకు వీలు లేదని, మధ్యాహ్నం మూడు గంటల తరువాత కలవాలని చెప్పిన సిబ్బంది
2023-11-13 13:55:27
బీఆర్ఎస్లో చేరిన గట్టు రామచంద్రరావు
- గట్టు రామచంద్రరావు అధికార బీఆర్ఎస్లో చేరారు.
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు
- హరీష్ రావు కామెంట్స్..
- ఐదు నెలల కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
- కర్ణాటకలో రైతు బంధు రావటం లేదు
- యువశక్తి, మహిళ శక్తి ప్రారంభం కాలేదు
- రేవంత్ రెడ్డి నాలుక కర్చుకుంటున్నాడు
- ఆగమైపోయామని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు
- తెలంగాణ అమరుల త్యాగలను కాంగ్రెస్ నేతలు కించపరుస్తున్నారు.
- ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నేతల చేతుల్లో కీలు బొమ్మలు
- మార్పు పదవుల కోసం రావొద్దు
- మార్పు రావాల్సింది ప్రజల జీవితాల్లో రావాలి
- మీ చేతుల్లోకి తెలంగాణ వెళ్తే కుర్చీ కోసం కొట్లాటే
- అందుకే కాంగ్రెస్ చేతుల్లో తెలంగాణ పెట్టొద్దు.
2023-11-13 13:46:32
తెలంగాణ అందరిది.. సంపద ప్రజలది: భట్టి
- ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
- బోనకల్లు మండలంలో విక్రమార్క ఎన్నికల ప్రచారం.
- మోటమర్రిలో భట్టి కామెంట్స్..
- మాయమాటలతో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయినా అభివృద్ధి జరగలేదు.
- ధనికరాష్ట్రంతో తెలంగాణ ఇస్తే.. పాలకులు దోచుకుతిన్నారు.
- ఈ ఎన్నికలు దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న పోరు.
- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం.
- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించాం.
- రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించాం.
- ఇళ్ల స్థలాలు ఉంటే ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం.
- ఈ రాష్ట్రం అందరిది.. ఈ సంపద అందరికి చెందాలి.
- ఇది అందరి ప్రభుత్వం.. అందదిరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం.
- అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో గోవిందాపురం నుండి మోటమర్రి వరకు రోడ్డు నిర్మిస్తానని హామీ.
2023-11-13 11:57:41
నిజామాబాద్‌లో టెన్షన్.. టెన్షన్
- ఎన్నికల వేళ నిజామాబాద్ పొలిటికల్ టెన్షన్
- బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తా వర్సెస్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్
- బహిరంగ చర్చకు వస్తానని అంటున్న ధన్పాల్
- కంఠేశ్వర్ ఆలయం దగ్గర బహిరంగ చర్చకు సిద్ధమైన ఇద్దరు నేతలు
- చర్చకు అనుమతి లేదని బీజేపీ నేతకు పోలీసుల నోటీసులు
- చర్చకు వెళ్లి తీరుతామని చెబుతున్న బీజేపీ నేతలు
2023-11-13 10:19:44
బీజేపీకి తుల ఉమ రాజీనామా..
- బీజేపీ నాయకురాలు తుల ఉమ కాషాయ పార్టీకి రాజీనామా
- రాజీనామా లేఖను కిషన్‌రెడ్డికి పంపిన ఉమ
- లేఖలో బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు
- ఓబీసీ మహిళను, తన జాతి గొల్లకురుమలను అవమానించిన పార్టీ బీజేపీ అంటూ వ్యాఖ్యలు
- అలాంటి బీజేపీ బీసీ నినాదం తీసుకోవడం హాస్యాస్పదం
- మీ టిక్కెట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజానీకంతో తనకు పెనవేసుకున్న బంధాన్ని తెంపలేవు అంటూ కామెంట్స్
- నేడు బీఆర్ఎస్లోకి తుల ఉమ.
- ఈరోజు ఉదయం సిరిసిల్లో బీఆర్ఎస్ నేతలతో ఉమ భేటీ.
2023-11-13 10:09:24
తెలంగాణలో మోదీ ప్రచారం..
- తెలంగాణలో ఈనెల 25, 26, 27 తేదీల్లో మోదీ ప్రచారం
- కరీంనగర్, నిర్మల్, హైదరాబాద్ సభల్లో పాల్గొననున్న మోదీ
- ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ
- మోదీ రాకతో బీజేపీ శ్రేణుల్లో జోష్
2023-11-13 08:32:25
స్పీడ్ పెంచిన సీఎం కేసీఆర్
- నేటి నుంచి బీఆర్ఎస్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు
- ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్
- నేడు బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ సభలకు కేసీఆర్
- ఈ నెల 28న వరంగల్ ఈస్ట్, వెస్ట్ తోపాటు గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలు
- గజ్వేల్ సభతో ముగియనున్న కేసీఆర్ ఎన్నికల ప్రచారం
- ఈ నెల 28వ తేదీ వరకు 54 సభల్లో పాల్గొననున్న కేసీఆర్
- ఇప్పటికే తొలి విడుత ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్
2023-11-13 08:07:36
పొంగులేటి ఆసక్తికర కామెంట్స్..
- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది.
- ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
- కాంగ్రెస్ 72-78 సీట్లలో గెలవబోతోంది.
- పార్టీ కార్యకర్తల కోసం ఎంత దూరమైన వెళ్తాను.
2023-11-13 08:05:03
నేడు బీఆర్ఎస్లోకి తుల ఉమ
- బీజేపీ నేత తుల ఉమ నేడు బీఆర్ఎస్లో చేరనున్నారు.
- సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి తుల ఉమ
- బీజేపీ నుంచి వేములవాడ టికెట్ దక్కకపోవడంతో ఆవేదనలో ఉమ
- కార్యకర్తలతో చర్చించి బీఆర్ఎస్లోకి వస్తున్న తుల ఉమ
2023-11-13 08:02:50
నేడు నామినేషన్ల పరిశీలన
- తెలంగాణలో నేడు నామినేషన్ల పరిశీలన
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కలిపి 4,798 మంది 5,716 నామినేషన్లు దాఖలు
- అత్యధికంగా గజ్వేల్‌లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు.
- అత్యల్పంగా నారాయణపేటలో దాఖలైంది 13 మాత్రమే.
- వైరా, మక్తల్‌లో 19 చొప్పున నామినేషన్లు దాఖలు
- అసలు బరిలో ఉండే అభ్యర్థుల లెక్కను తేల్చనున్న ఈసీ
- మొదటి నుంచి టెక్నికల్ అంశాలపై దృష్టి పెట్టిన ఎలక్షన్ కమిషన్
- రూల్స్ ప్రకారం ఏ చిన్న తప్పు ఉన్నా తిరస్కరించనున్న ఈసీ
- ఒక్కో అభ్యర్థి కనీసం రెండు సెట్ల నామినేషన్ల దాఖలు
- ఈ నెల 15వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ
- నవంబర్ 30వ తేదీన పోలింగ్
- డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్
2023-11-13 07:35:15
Related News By Category
-
నేడు ఎమ్మెల్యేల అనర్హతపై తీర్పు.. కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం తీర్పు వె...
-
దమ్ముంటే కబ్జా నిరూపించు..: హరీశ్‌రావు
వట్పల్లి (అందోల్): రంగనాయక్ సాగర్ వద్ద ఇరిగేషన్ భూములను తాను ఆక్రమించలేదని, రైతుల వద్ద 13 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. ద...
-
హరీశ్‌రావు కొన్న భూములపై విచారణ: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి అప్పటి మంత్రి హరీశ్‌రావు భూములు కొనుగోలు చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచా...
-
అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?.. మోదీకి కవిత సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: జైలు నుంచి విడుదలయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత ట్వీట్ చేసిన కవిత.. అదానీ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ప్రధ...
-
అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?.. మోదీకి కవిత సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: జైలు నుంచి విడుదలయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత ట్వీట్ చేసిన కవిత.. అదానీ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ప్రధ...
Related News By Tags
-
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
-
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
-
కాంగ్రెస్‌కే పూర్తి మెజారిటీ.. ఇండియా టుడే సర్వే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే– యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్‌పోల్ సర్వే పేర్కొంది. మొత్తం 119 అసెంబ్లీ ని...
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Update.. ఎల్లుండి(డిసెంబర్ 3, ఆదివారం) తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు తెలంగాణ : లెక్కింపు కేంద్రాల ...
-
తెలంగాణలో ముగిసిన పోలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. కానీ, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారుల...
Advertisement
Comments
Please login to add a commentAdd a comment