
తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఈరోజు అప్డేట్స్..
ఆయుర్వేదం అనగానే ముందుగా గుర్తొచ్చే�...
ఆయుర్వేదం అనగానే ముందుగా గుర్తొచ్చే�...
పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిం...
ఢిల్లీ: దేశంలోని 32 విమానాశ్రయాల మూసివ...
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొ�...
దేశంలో పసిడి ప్రియులకు బంగారం ధరలు (Gold...
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత�...
సాక్షి, ఢిల్లీ: భారత్-పాక్ మధ్య శనివ...
మనలో చాలామంది నిద్రలేమి సమస్యలతో సతమ...
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో దారు...
వడోదరలో పూల గడియారం... అహ్మదాబాద్లో స...
సాక్షి, తాడేపల్లి: నేడు గౌతమ బుద్ధుడి ...
గుర్రపు స్వారీపై యువతతో పాటు సీనియర్...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనా...
నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా హైదరా...
Nov 11 2023 6:50 AM | Updated on Nov 23 2023 11:50 AM
తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఈరోజు అప్డేట్స్..
తెలంగాణ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
రాజన్న సిరిసిల్ల జిల్లా:
రాజన్న సిరిసిల్ల జిల్లా :
ఖమ్మం జిల్లా:
►కాంగ్రెస్ నుంచి సత్తుపల్లి టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు.
►ఖమ్మం జిల్లా: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సత్తుపల్లి కాంగ్రెస్ నాయకుడు కొండూరు సుధాకర్
►సత్తుపల్లి టికెట్ ఆశించి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న కొండూరు సుధాకర్.
►రెండు రోజుల క్రితం మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
►కాంగ్రెస్ నాయకులు పార్టీ మారుతుండటంతో స్థానికంగా ఉన్న హస్తం క్యాడర్ అయోమయంలో పడింది.
►జగిత్యాల: కేసీఆర్పై జీవన్ రెడ్డి సెటైర్లు
►రాయికల్ మండలం ఇటిక్యాలలో ప్రచారంలో భాగంగా కేసీఆర్ తీరుపై జీవన్ రెడ్డి విమర్శలు.
►మస్కట్ పోయేటోళ్లనే పాస్ పోర్టుల పేరుతో మోసం చేసిన వ్యక్తి దళితబంధు ఇస్తాడని ఎలా నమ్ముతాం..?
►కేసీఆర్, నేను కలిసి చదువుకున్నాం, నాకు ఆయన గురించి బాగా తెలుసు.
►దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, ఇల్లు కట్టించడం వంటి హామీలు తుంగలో తొక్కిండు.
► అంబేద్కర్ దయతో రాజ్యాంగపరంగా దళితులకు చెందాల్సిన 40 వేల కోట్ల ఎస్సీ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్స్ను కూడా పక్కదారి పట్టించాడు.
►ఇప్పటికైనా దళితులు ఆలోచించాలి.
►పార్టీకి రాజీనామా చేయనున్న పాల్వాయి స్రవంతి
►నేడో రేపో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న స్రవంతి
►గతేడాది మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన స్రవంతి
►మునుగోడు టికెట్ ఆశించి రాకపోవడంతో మనస్తాపం
►కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరనున్న స్రవంతి
►12వ వార్డ్ కౌన్సిలర్ రామతీర్థం కృష్ణవేణి, హరీష్ దంపతులు బీజేపీకి రాజీనామా.
వేములవాడలో బీజేపీకి షాక్.
►చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక.
►బీజేపీ నేత తుల ఉమను కలిసిన వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్.
►బీజేపీ చివరి జాబితాలో పేరు ప్రకటించి.. బీ-ఫామ్ చెన్నమనేని వికాస్ రావుకు ఇవ్వడంతో తీవ్ర మనస్థాపం చెందిన తుల ఉమ.
►ఈ క్రమంలో తుల ఉమను ఆది శ్రీనివాస్ కలవడంతో రసవత్తరంగా వేములవాడ రాజకీయాలు
►కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్, బీజేపీ నాయకురాలు తుల ఉమను వేములవాడలో తన నివాసంలో కలిసి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య.
►తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపిన ఉమ.
► మంత్రి కేటీఆర్ ఆదేశాలు మేరకు తుల ఉమతో బీఆర్ఎస్ నేతల మంతనాలు.
► వేములవాడ బీజేపీ అభ్యర్థిగా తుల ఉమను ప్రకటించిన విషయం తెలిసిందే
►చివరి క్షణంలో ఉమకు కాకుండా చెన్నమనేని వికాస్రావుకు బీ-ఫామ్ ఇచ్చిన అధిష్టానం
► శుక్రవారంతో ముగిసిన నామినేషన్ల ఘట్టం.
►నిన్న చివరి తేదీ కావడంతో భారీ సంఖ్యలో దాఖలైన నామినేషన్లు.
►నిన్న ఒక్కరోజే 2321 నామినేషన్లు దాఖలు.
►రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నామినేషన్లు 4795 నామినేషన్లు దాఖలు.
►నిన్న వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం
►ఎమ్మెల్యేను చూసేందుకు తరలివచ్చిన మహిళలు
►గణేష్ మండపంపై నిల్చుని ఉన్న క్రమంలో ఒక్కసారిగా కూలిన మండపం
►ఈ ఘటనలో పదిమంది మహిళలకు గాయాలు
►క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
►ఎట్టకేలకు 118 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు
►పొత్తులో భాగంగా ఒక సీటు సీపీఐకి
►మొత్తం నాలుగు జాబితాలు విడుదల చేసిన అధిష్టానం
►నాలుగైదు చోట్ల చివరి నిమిషంలో మార్పులు
►రెండు చోట్ల పోటీ చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్
►బీసీలకు 23 టికెట్లు..అగ్రవర్ణాలకు 58
►టికెట్లు రాని 15 మందితో వేణుగోపాల్ భేటీ
►పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని, భవిష్యత్తులో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ
►షెట్కార్, సంజీవరెడ్డిల మధ్య సయోధ్య.. నారాయణఖేడ్ టికెట్ మార్పు
►పలువురికి ఎంపీ టికెట్లపై వాగ్దానం.. జహీరాబాద్ ఎంపీగా షెట్కార్!
►మాదిగల విశ్వరూప మహాసభలో పాల్గొననున్న ప్రధాని
►ఈ నెల 26న నిర్మల్లో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ
►రాష్ట్రంలో ఎన్నికల ప్రచార ముగింపు సభకూ రాక
►చివరి రోజు 2,251 నామినేషన్లు దాఖలు
►నియోజకవర్గాలవారీగా నామినేషన్లు వేసిన అభ్యర్థుల జాబితా నేడు ప్రకటన
►15తో ముగియనున్న ఉపసంహరణకు గడువు
►నవంబర్ 30న ఉదయం 7 నుంచి 5 గంటల వరకు పోలింగ్
►డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన