
కమలాపూర్: ‘అయ్యా కొడుకులిద్దరూ మత్తులో మునుగుతున్నారు. ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి బయటకు పంపాక.. ఎంత తాగినా మనసుల పడుతలేదట, మందు ఎక్కుత లేదట’అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను తీ వ్రస్థాయిలో విమర్శించారు.
గురువారం ఆయ న హనుమకొండ జిల్లా కమలాపూర్ మండ లం మర్రిపల్లి, మర్రిపల్లిగూడెం, జూజునూర్‌పల్లి, వంగపల్లి, పంగిడిపల్లి, లక్ష్మీపూర్ గ్రామా ల్లో మాజీ మంత్రి, బీజేపీ హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు.