భూపాలపల్లి: కామ్రేడ్లు కలిసొస్తే ఎన్నికల్లో పొత్తులకు సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ‘ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు అవిభక్త కవలలు. వారి ఆలోచన, తలలు కలిసే ఉంటాయి. శరీరాలను వేరు చేస్తే మాత్రం ప్రాణం పోతుంది. వారిపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే ఆ రెండు పార్టీలు కొద్ది రోజులుగా ప్రజల ముందు విమర్శలు చేసుకుంటున్నాయి’అని రేవంత్ ఆరోపించారు.
రేవంత్ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్ర మంగళవారం భూపాలపల్లిలో కొనసాగింది. ఉదయం సింగరేణి గనుల వద్ద గేట్ సమావేశం, రాత్రి అంబేడ్కర్ చౌరస్తా వద్ద జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్ ప్రసంగించారు. పొత్తుల విషయంలో జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఏపీలో టీడీపీతో బీజేపీ జతకట్టే అవకాశం ఉన్నందున తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్‌కు పొత్తు ఉండే అవకాశం లేదన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, మాజీ ఎంపీలు మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, అంజన్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేతలు వేం నరేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment