
సాక్షి, అమరావతి: జంగారెడ్డి గూడెం మరణాలపై టీడీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. సహజ మరణాలను మద్యం మరణాలుగా దుష్రచారం చేయడం తగదని, ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
మూడో తేది చనిపోతే ఇప్పుడు రాద్దాంతాం చేస్తున్నారని, ఇదంతా టీడీపీ నాయకులు శవాలపై చిల్లర ఏరుకునే నీచ రాజకీయాలేనని ధ్వజమెత్తారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, ఘాటుగా బదులిస్తామని ఆయన అన్నారు.