
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కుట్రలతో అధికారాన్ని చేపట్టారని, ఆయన స్వయం ప్రకటిత మేధావి వరుస ట్వీట్లలో చురకలంటించారు.‘వెన్నుపోటుతో, అప్రజాస్వామిక పద్ధతుల్లో చంద్రబాబు పీఠమెక్కిన రోజు ఇది. ఏనాడూ చంద్రబాబు ప్రజల్లోంచి అధికారాన్ని తెచ్చుకోలేదు. ఎత్తులు, కుట్రలు, మేనెజ్‌మెంట్ వ్యవహారాలతో.. అనుకూల మీడియా చిత్రించిన స్వయంప్రకటిత మేధావిగా బండి ఈడ్చారు’అని సజ్జల సెటైర్లు వేశారు.
‘తన 14 ఏళ్లపాలనలో ప్రజలు గుర్తించుకోదగ్గ ఒక పనీ చేయలేదు. విద్య, వైద్యం, ఆరోగ్య వ్యవస్థలను తన మనుషులకు, బినామీదార్లకు అమ్మేశారు. చివరకు పాలవ్యాపారాన్నీ గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. సంక్షోభ సమయాల్లో ప్రజలను వదిలేసి మీడియా విన్యాసాలతో చరిత్రహీనుడిగా మిగిలిపోయారు. పోరాటాలనుంచి ఎదిగిన నాయకుడు జగన్‌గారు. ప్రజలనుంచి అధికారాన్ని తెచ్చుకున్నారు. కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలతో పరుగులు పెట్టించి ఆదర్శనీయంగా నిలిచారు. కుట్రల నాయుడుగారికీ, ప్రజా నాయకుడికీ తేడాను స్పష్టంగా ప్రజలు చూస్తున్నారు’ అని సజ్జల పేర్కొన్నారు.
(చదవండి: బాబు విషప్రచారాల బాటలోనే లోకేష్ )
Comments
Please login to add a commentAdd a comment