
చంద్రబాబును విశాఖ ప్రజలు మరోసారి తిరస్కరించారన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ప్రజలు స్వాగతించారని పేర్కొన్నారు
సాక్షి, విశాఖపట్నం: మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును విశాఖ ప్రజలు మరోసారి తిరస్కరించారన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ప్రజలు స్వాగతించారని పేర్కొన్నారు. విశాఖ ఎన్నికలు 3 రాజధానులకు రెఫరెండమన్న చంద్రబాబు ఇప్పుడేమంటారని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. సెల్ఫ్ సర్టిఫికెట్ మేధావి యనమల మున్సిపాలిటీలో ఘోర పరాభవం చవిచూశారని ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారని.. ఇకనైనా చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఎమ్మెల్యే అమర్‌నాథ్ డిమాండ్ చేశారు.
చదవండి
ఏమైందమ్మా నాకు.. భయమేస్తోందమ్మా..
నే గెలిచా... లేవండీ!