
సాక్షి, తాడేపల్లి: ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు అని అన్నారు. అలాగే, సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదన్నది నానుడి అంటూ కామెంట్స్ చేశారు.
కాగా, ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు నాయుడు. ఇక అతని పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు!. సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదన్నది నానుడి. పాలకులకి ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరు సమానులే. సీఎం చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డుఫై కట్టిన అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్నారు. దీంతో, బుడమేరు రివలెట్‌పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుంది!?. అందువల్ల చంద్రబాబు నివసించే అక్రమ కట్టడం మొదట కూలగొట్టడం సముచితం’ అంటూ కామెంట్స్ చేశారు.
అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి శ్రీ చంద్రబాబు నాయుడు @ncbn . ఇక అతని పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు! సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనపడదన్నది నానుడి. పాలకులకి ఒక న్యాయం పౌరులకు ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరు సమానులే.
సీఎం చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన… pic.twitter.com/SkOq4EnmZd— Vijayasai Reddy V (@VSReddy_MP) September 17, 2024
ఇది కూడా చదవండి: ‘కార్మిక నేతలే స్టీల్‌ప్లాంట్ అమ్మేయాలని చూస్తున్నారు’: జనసేన నేత సంచలన వ్యాఖ్యలు