
సాక్షి,తాడేపల్లి: ప్రపంచం ఎంతో మారింది కానీ చంద్రబాబు మారడని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం(నవంబర్ 8) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు. పోస్టులో బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘చంద్రబాబు పుట్టినప్పటి నుంచి అవే అబద్ధాలు..అవే మోసాలు..జ్ఞానం కలగాల్సిన వయసులో కూడా ఏ మాత్రం సంకోచించకుండా,వెనుకాడకుండా పాపాలు చేస్తూనే ఉన్నాడు. నరకం ఇతనికి చాలదు. యముడు బాబు కోసం ప్రత్యేక లోకాన్ని సృష్టించాల్సిందే. ఆ యముడిని కూడా తప్పుదారి పట్టిస్తాడేమో’అని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో సెటైర్లు వేశారు.
ప్రపంచం ఎంతో మారింది. కానీ చంద్రబాబు మారడు. పుట్టిన దగ్గర నుండీ అవే అబద్ధాలు, అవే మోసాలు. జ్ఞానం కలగాల్సిన వయస్సులో కూడా ఏమాత్రం సంకోచించక, వెనకాడకుండా పాపాలు చేస్తూనే వున్నాడు. నరకం ఇతనికి చాలదు...యముడు ప్రత్యేక లోకాన్ని సృష్టించాల్సిందే. ఆ యముడ్ని కూడా తప్పు దారి…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 8, 2024
ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు