
రోడ్డు పక్కన పొలంలో పడిపోయిన ఆర్టీసీ ఇంరద్ర బస్సు
యర్రగొండపాలెం: స్థానిక మార్కాపురం రోడ్డులోని పాల కేంద్రానికి సమీపంలో మంగళవారం ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మార్కాపురం వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సు ప్రైవేట్ పాలకేంద్రానికి సమీపంలోని హైవే రోడ్డుపై ఎదురుగా వస్తున్న లారీని డ్రైవర్ తప్పించే క్రమంలో అదుపు తప్పింది. పక్కనే ఉన్న చప్టాకు ఢీకొని పొలాల్లో బోల్తా పడింది.
డ్రైవర్ నాగేశ్వరరావు కాలికి, కనిగిరికి చెందిన ప్రయాణికురాలు డి.ఆదిలక్ష్మికి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మార్కాపురానికి చెందిన 8 మంది ప్రయాణికులు ధరణి, సురేంద్ర శ్రీనివాస్, మంత్రయ్య, చెన్నమ్మ, భువన్‌కుమార్, పోతిరెడ్డి, మహబూబ్‌బాష, బస్సు హెల్పర్ ఇస్సాక్‌లకు స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడిన వీరిని 108లో స్థానిక ఏరియా వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.కోటయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment