పొగాకులో నాణ్యత అంశాల పరిశీలన
నాగులుప్పలపాడు: పొగాకు పంటలో నాణ్యతా ప్రమాణాలపైనే బయ్యర్ల దృష్టి ఉంటుందని కర్ణాటక పొగాకు బోర్డు మాజీ వైస్ చైర్మన్ బసవరాజు తెలిపారు. ఆంధ్రా పొగాకు పంట నాణ్యత, దిగుబడి అంశాలను పరిశీలించేందుకు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన బోర్డు సభ్యులతో కలిసి నిడమానూరు గ్రామంలో ఆదివారం పొగాకు తోటలను పరిశీలించారు. అనంతరం బ్యారన్ క్యూరింగ్, నాణ్యత వంటి వివరాలను స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట బోర్డు సభ్యులు దినేష్ గౌడ, విక్రమ్ రాజ్ గౌడ, భారత పొగాకు బోర్డు సభ్యులు మారెడ్డి సుబ్బారెడ్డి, ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment