జిల్లా సీనియర్‌ పురుషుల హాకీ జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా సీనియర్‌ పురుషుల హాకీ జట్టు ఎంపిక

Published Mon, Feb 24 2025 12:44 AM | Last Updated on Mon, Feb 24 2025 12:43 AM

జిల్లా సీనియర్‌ పురుషుల హాకీ జట్టు ఎంపిక

జిల్లా సీనియర్‌ పురుషుల హాకీ జట్టు ఎంపిక

ఒంగోలు: సీనియర్‌ పురుషుల హాకీ జట్టు ఎంపిక ఆదివారం స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియను హాకీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఎ.సుందర రామిరెడ్డి ఆధ్వర్యంలో పరిశీలకులు చంద్రశేఖర్‌, టి.రవికుమార్‌, పి.రవి పర్యవేక్షించారు. ఎంపికై న జట్టు మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీలో జరిగే రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటుందని అసోసియేషన్‌ కార్యదర్శి సుందరరామిరెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఎంపికై న క్రీడాకారులను ఆయన అభినందించి రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

ఎంపికై న జట్టు:

రాఘవేంద్ర, యువరాజ్‌, భానుప్రకాష్‌, రాము, భరత్‌, శ్రీకాంత్‌, మోహన్‌, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, రాజేష్‌బాబు, వీరాంజనేయులు, కార్తీక్‌, గణేష్‌, బాలశివకుమార్‌, కాలేషా, మణికంఠ, సందీప్‌, అశోక్‌, సుధాకర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement