జాతీయ ఓపెన్ కరాటే పోటీల్లో ఒంగోలు విద్యార్థుల ప్రతిభ
ఒంగోలు: జాతీయ ఓపెన్ కరాటే పోటీల్లో ఒంగోలు విద్యార్థులు సత్తాచాటారు. చిలకలూరిపేటలోని ఆర్యవైశ్య కళ్యాణమండపంలో ఫునాకొషి షోటోకాన్ కరాటే వారు ఆదివారం జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఒంగోలు విద్యార్థులు 14 మంది వివిధ కేటగిరీల్లో కటాస్ విభాగంలో పాల్గొని పతకాలు కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరిని జపాన్ కరాటే అసోసియేషన్ సౌత్ ఇండియా చీఫ్ రాపోలు సుదర్శన్, గుంటూరు జిల్లా కార్యదర్శి కె.రఘునాథబాబు, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు టి.శ్రీనివాసరెడ్డి తదితరులు అభినందించారు.
పతకాలు సాధించిన బాలికలు:
ఎన్‌ఎస్‌ఎస్ దీపాంజలి–అండర్ 14 బంగారు పతకం, ఎస్.ప్రశాంతి–అండర్ 12 బంగారు పతకం, జి.చాతుర్య అండర్ 14 వెండి, కె.అనన్య–అండర్ 14 వెండి, సీహెచ్ అక్షర–అండర్ 14 కాంస్య, సీహెచ్ హేమప్రియ అండర్–14 కాంస్య టి.జ్యోషిత–అండర్ 10 కాంస్య, ఈ.దేదీప్య–అండర్ 8 కాంస్య.
పతకాలు సాధించిన బాలురు:
డి.యశ్వంత్–అండర్ 14 బంగారు పతకం, వి.గౌతం వర్షిత్–అండర్ 10 బంగారు, పి.తేజవర్థన్–అండర్ 12 వెండి, కె.ప్రజ్వల– అండర్ 11 కాంస్య, పి.లేఖన్–అండర్ 10 కాంస్య, పి.మన్విత్–అండర్ 10 కాంస్య మెడల్.
Comments
Please login to add a commentAdd a comment