గిరిజనులను అడ్డుకున్న అటవీశాఖ అధికారులు
పెద్దదోర్నాల: శ్రీశైలంలో దైవదర్శనం అనంతరం స్వస్థలాలకు అటవీ మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించిన గిరిజనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలోని నెక్కంటి బేస్ క్యాంపు వద్ద గురువారం జరిగింది. వివరాల్లోకి ..నియోజకవర్గంలోని పాలుట్ల, నెక్కంటికి చెందిన గిరిజనులు శ్రీశైలంలో దైవదర్శనం ముగించుకుని స్వస్థలాలకు బయలు దేరారు. ఈ క్రమంలో వారికి అత్యంత సమీపంలోని ఇష్టకామేశ్వరి అలయానికి వెళ్లే రహదారిలో వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న అటవీశాఖ అధికారులు వీరిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గిరిజనులు తాము ఎన్నేళ్ల నుంచో ప్రయాణాలు చేసే దారిలో వెళ్లేందుకు మీ అనుమతులు ఎందుకంటూ వారితో వాదనకు దిగారు. అయినా అధికారులు పట్టు వదలకపోవటంతో వారు శ్రీశైలం రహదారిలో రాస్తారోకో చేపట్టంతో ఆ రహదారిలో వాహనాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దిగివచ్చిన అధికారులు గిరిజనులను అటవీమార్గంలో ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వటంలో అందోళన సద్దుమణిగింది.
నెక్కంటి బేస్ క్యాంపు వద్ద గిరిజనుల రాస్తారోకో..
Comments
Please login to add a commentAdd a comment