ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించాలి
మర్రిపూడి: ప్రభుత్వ భూముల్లో ఎలాంటి ఆక్రమణలు ఉన్నా వెంటనే తొలగించాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మండల అధికారులను ఆదేశించారు. మండలంలోని జువ్విగుంటలో భూముల రీ సర్వేను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వేలో తొలుత విలేజ్ బౌండరీ, బ్లాక్ బౌండీరీ, ప్రభుత్వ భూములను హద్దులు పూర్తి చేసిన తర్వాతే పట్టా భూములను ప్రారంభించాలన్నారు. పట్టాదారు సమక్షంలో మాత్రమే భూములు సర్వే చేయాలన్నారు. సుదూర ప్రాంతంలో నివసిస్తున్న రైతుల వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేసి వారికి వాట్సప్ ద్వారా సమాచారం ఇచ్చి వారు రీ సర్వేలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ జ్వాలా నరసింహారావు, డీటీ నాగరాజు, సర్వేయర్ బాల వెంకటరెడ్డి పాల్గొన్నారు.
టంగుటూరు: మండలంలోని కొణిజేడు గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను జేసీ గోపాలకృష్ణ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్వే అధికారులు, సిబ్బందికి సూచనలుచేశారు. తహసీల్దార్ ఆంజనేయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment