హామీలకు నీళ్లు..
మిర్చి క్లస్టర్ ఎవరి కోసం..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో లాభాలు చవిచూసిన మిర్చి రైతులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరల్లేక, ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో భారీగా నష్టపోయారు. గుంటూరు మార్కెట్లో ధరలు పతనమవుతున్న సమయంలో ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న రైతులకు వినతులను ప్రభుత్వ పెద్దలుగాని, జిల్లా ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో మిర్చిరైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తాజా బడ్జెట్‌లో జిల్లాను మిర్చిక్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి చేతులు దులుపుకుంది. అసలు ఇది ఎవరికోసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.
తాగు, సాగునీటి ప్రాజెక్టులకు తీరని నష్టం
జిల్లాకు ప్రధాన సాగునీటి వనరైన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో కేవలం రూ.359 కోట్లు కేటాయించడం దారుణం. మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు పరిశీలనకు వచ్చినప్పుడు రూ.4 వేల కోట్లు అవసరమని చెప్పి బడ్జెట్‌లో 10 శాతం కూడా కేటాయించలేదు. ఈ లెక్కన ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో అర్థం కావటం లేదు. జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందించకుండా నాలుగు సంవత్సరాల పాటు ప్రాజెక్టును సాగదీయటమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా ఉంది. రాష్ట్ర మంత్రి స్వామి మాత్రం బడ్జెట్ సూపర్‌గా ఉందని ప్రకటించడాన్ని బట్టి ఆయన బడ్జెట్ కేటాయింపులు తెలిసి మాట్లాడుతున్నాడా లేక తెలియక మాట్లాడుతున్నాడా అర్థం కావటం లేదు. మంత్రి స్వామి ఇవే మాటలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి చెబితే ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారు.
–డాక్టర్ ఆదిమూలపు సురేష్, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి
నిధులు కేటాయింపులో తీవ్ర అన్యాయం
వెలుగొండ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగింది. గత బడ్జెట్‌లో రూ.399 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రూ.359 కోట్లు కేటాయించింది. కేవలం నిర్వాసితులను తరలించడానికే రూ.800 కోట్ల ఖర్చవుతుంది. ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.2 వేల కోట్లు అవసరం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులు ప్రాజెక్టును సందర్శించి సమీక్షలు జరిపి వచ్చే జూన్, జూలై నెలల్లో నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా ప్రాజెక్టు పనులు ఏ విధంగా పూర్తవుతాయి?. సూపర్ సిక్స్ పథకాలు కేటాయింపులు లేవు. తల్లికి వందనంకి రూ.12 వేల కోట్లు అవసరమైతే రూ.9400 కోట్లు మాత్రమే కేటాయించారు.
– బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే
హామీలకు నీళ్లు..
Comments
Please login to add a commentAdd a comment