
త్రిపురాంతకేశ్వరుడి ఆదాయం రూ.12.82 లక్షలు
త్రిపురాంతకం: పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయాల హుండీ ఆదాయం రూ.12,82,579 వచ్చినట్లు ఆలయాల కార్యనిర్వహణాధికారి డి.రజనీకుమారి తెలిపారు. స్వామివారి దేవస్థానం హుండీలో రూ.7,88,736, అమ్మవారి దేవస్థానం హుండీలో రూ.4,59,781, అన్నదానం హుండీలో రూ.34,062 వచ్చినట్లు పేర్కొన్నారు. హుండీలను చీఫ్ ఫెస్టివల్ అధికారి డి.అనిల్‌కుమార్, ఆలయాల కమిటీ చైర్మన్ ఇమ్మడిశెట్టి వెంకట సుబ్బారావు, ధర్మకర్తల మండలి సభ్యులు, బాలా త్రిపుర సుందరీ, భ్రమరాంబ సేవా సమితీల ఆధ్వర్యంలో లెక్కించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment