ఒంగోలు వన్‌టౌన్: బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఎం.వెంకటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులాలకు చెందిన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ టైలరింగ్‌లో ఉచిత శిక్షణను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల మహిళలు సంబంధిత ఎంపీడీఓల కార్యాలయాల్లోగానీ, సచివాలయాల్లోగానీ యాప్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 90 రోజుల పాటు ఉచిత కుట్టు శిక్షణ పూర్తయిన తర్వాత కుట్టుమిషన్ అందిస్తామన్నారు. మహిళల వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment