మూలరక్త కణాలు ఇచ్చి ప్రాణాలు కాపాడి..
ఒంగోలు సిటీ: క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆరేళ్ల చిన్నారి చికిత్స కోసం మూలరక్త కణాలు ఇచ్చి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాడు ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్‌బీఎస్ రెండో ఏడాది చదువుతున్న ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ దోసపాటి సుబ్బారెడ్డి.. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆరేళ్ల చిన్నారి చికిత్స కోసం మూలరక్త కణాలు ఇచ్చి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఇలాంటి అవకాశం అరుదుగా దక్కుతుందని, ఈ విషయంపై అవగాహన కలిగి, హైదరాబాద్‌కు వెళ్లి డొనేట్ చేసి రావడం గొప్పవిషయమని క్విస్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ సూర్యకళ్యాణ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ గాయత్రి విద్యార్థిని మంగళవారం అభినందించారు. సుబ్బారెడ్డి తన మూలరక్త కణాలను ఇచ్చేందుకు ఒప్పుకున్న అతని తల్లిదండ్రులు వెంకటరత్తమ్మ, నరసారెడ్డిని కూడా అభినందించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం, కణాల దానంపై అవగాహన కలిగి ఉండాలని, అది ఒక నిండుప్రాణాన్ని కాపాడుతుందని అన్నారు. రక్తకణాలను దానం చేసిన సుబ్బారెడ్డికి ధాత్రి బ్లడ్ స్టెమ్ డొనేషన్ వారు ప్రశంస పత్రం అందించారు.
మూలరక్త కణాలు ఇచ్చి ప్రాణాలు కాపాడి..
Comments
Please login to add a commentAdd a comment