ఎమ్మెల్యే జనార్దన్ పుట్టిన రోజు వేడుకలు జనవరి 20వ తేదీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు నగరం అంతటా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి వరకూ అవి అలాగే ఉన్నాయి. దాదాపు మూడు నెలల పాటు ఈ ఫ్లెక్సీల కారణంగా నగర ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇటు కార్పొరేషన్ అధికారులు కానీ అటు పోలీసులుకానీ స్పందిస్తే ఒట్టు. సత్య పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండు వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వరకు ఫ్లెక్సీలు వేసేందుకు సిద్ధం చేసుకుంటుండగా సోమవారం సాయంత్రం నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు నగరంలో ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదంటూ నోటీసు ఇవ్వడం వివాదంగా మారింది. నిన్న మొన్నటి వరకు లేని ఆంక్షలు ఇప్పుడే ఎందుకు విధిస్తున్నారో చెప్పాలని సత్య వర్గం ప్రశ్నిస్తోంది. ఎమ్మెల్యే జనార్దన్ ఒత్తిడితోనే నగర పాలక సంస్థ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment