
ధర పండక
కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాతకు కష్టకాలం దాపురించింది. ఒక పక్క వర్షాభావం, మరో పక్క అకాల వర్షాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా సాగు విస్తీర్ణం తగ్గింది. దిగుబడులూ తగ్గాయి. ఉత్పత్తులు తగ్గినప్పుడు సాధారణంగా మార్కెట్లో అనుకున్న ధరలు రావాలి. అందుకు భిన్నంగా ధరలు పతనమయ్యాయి. మిర్చి, పత్తి, శనగ, ధాన్యం ఇలా అన్ని పంటల ధరలు నేలచూపు చూస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో పుష్కలంగా పంటలు పండటంతో పాటు రైతు భరోసా డబ్బు రైతుకు కొండంత అండగా నిలిచింది. ఒకరకంగా రైతులకు స్వర్ణయుగం అని చెప్పాలి. తర్వాత ప్రభుత్వం మారింది. మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. 2024 ఎన్నికల సమయంలో రైతులకు ఆర్థిక సాయం అందిస్తామని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎప్పటిలాగే మొండిచేయి చూపించారు.
● తగ్గిన పంటల దిగుబడులు ● మార్కెట్లో ధరలు లేక అల్లాడుతున్న రైతులు ● ధాన్యం, మినుము, కంది, మిర్చి, శనగ తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేవు ● దయనీయంగా మారిన మిర్చి రైతు పరిస్థితి ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మిర్చి క్వింటా రూ.18 వేల నుంచి రూ.25 వేలు ● కూటమి ప్రభుత్వ హయాంలో రూ.6 వేలు కూడా రాని వైనం ● రైతు కష్టాలు పట్టని ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో మొత్తం 40 వేల హెక్టార్లలో ధాన్యం సాగుచేయాల్సి ఉంది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో 23 వేల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టారు. హెక్టారుకు 3.4 నుంచి 4 మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ లెక్కన సుమారు 90 వేల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నట్లు అంచనా. రైతుల సొంత అవసరాలు.. స్థానిక అవసరాలకు కలుపుకుని సగానికి అవసరం అనుకున్నా 50 వేల మెట్రిక్ టన్నులుపోను మిగతా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్‌లో కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించి కొనుగోలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా ఏర్పాటు చేయటంతో దళారులు బాహాటంగానే దోపిడీకి పాల్పడుతున్నారు. మద్దతు ధరపై బస్తాకు రూ.500 నుంచి రూ.600 వరకు తక్కువ ధర ఇస్తున్నారు. వడ్లకు మార్కెట్లో డిమాండ్ లేదు. రోజులు గడిచేకొద్దీ ధాన్యాన్ని అడిగేవారు ఉండరని దళారులు రైతులను బెదిరిస్తున్నారు. వీరి మాటలు నమ్మి విక్రయించేందుకు వెళితే ‘మట్టి తేమశాతం ఎక్కువగా ఉందని.. బియ్యం విరుగుతూ ఉన్నాయి’ అంటూ సాకులు చూపించి భయపెడుతున్నారు. ఐదు నుంచి ఆరు కిలోల వరకు తరుగు రూపంలో అదనంగా లాగేస్తూ మోసాలకు తెగబడుతున్నారు. ఈ దందా విచ్చలవిడిగా జరుగుతున్నా రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారు.
బాహాటంగానే దోపిడీ...
గ్రేడ్–ఏ రకానికి రూ.2,320 ఇవ్వనుండగా కామన్ ధాన్యం రకానికి రూ.2,300 ఇస్తోంది. ఈ ధరకు రైతుల వద్ద ఉన్న ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తే రైతులు అప్పుల నుంచి కనీసం బయటపడతారు. అలాంటిది రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవటంతో దళారులు కళ్లాల్లోనే అతి తక్కువ ధరకు కొనుగోలు చేసుకుపోతున్నారు. రైతులు చేసేది లేక క్వింటా ధాన్యం రూ.1500 నుంచి రూ.1800 తెగనమ్ముకోవాల్సిన పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం కల్పిస్తోంది. అంటే రైతు ప్రతి క్వింటాకు రూ.500 మేర తీవ్రంగా నష్టపోతున్నాడు.
జిల్లాలో గత ఆరేళ్లలో ప్రధాన పంటల సాగు వివరాలు (హెక్టార్లలో)
ఖరీఫ్, రబీ సీజన్లు కలుపుకుని...
సంవత్సరం వరి శనగ మినుము కంది మిర్చి
2019–20 65,130 86,180 12,368 94,791 39,564
2020–21 88,346 92,410 62,707 81,903 36,885
2021–22 69,061 1,00,935 46,398 80,712 41,250
2022–23 26,523 40,448 27,109 59,087 39,600
2023–24 15,652 35,302 15,426 67,569 29,650
2024–25 23,000 24,588 12,32 71,665 26,163
సంవత్సరాల వారీగా పంటల దిగుబడులు (మెట్రిక్ టన్నుల్లో)
సంవత్సరం వరి శనగ మినుము కంది మిర్చి
2019–20 4,31,495 1,11,170 11,340 48,874 2,76,948
2020–21 4,75,788 1,22,834 21,141 35,115 2,39,752
2021–22 5,53,345 1,76,000 61,075 99,750 2,88,750
2022–23 1,49,541 65,233 17,628 11,094 2,77,200
2023–24 61,324 48,117 10,826 26,676 1,77,900
2024–25 90,000 60,826 14,500 72,400 15,7692

ధర పండక

ధర పండక

ధర పండక

ధర పండక
Comments
Please login to add a commentAdd a comment