
బాలినేని ఇంతలా దిగజారి మాట్లాడాలా?
● ఎక్స్‌లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ట్వీట్
టంగుటూరు:
బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయాల కోసం ఇంతలా దిగజారి మాట్లాడాలా అని మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్ శనివారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దయవల్ల రాజకీయాల్లో పదవులు అనుభవించి ఇప్పుడు ఆయన కుమారుడు జగనన్న అస్తిత్వాన్ని ప్రశ్నిస్తావా..నీ అస్తిత్వం ఎక్కడో ఒక్కసారి ప్రశ్నించుకో.. వైవీ సుబ్బారెడ్డి బామ్మర్దిగా రాజశేఖరరెడ్డి కుటుంబానికి దగ్గరయ్యావు తప్ప లేకుంటే నీ అస్తిత్వం ఏంటో నీకు తెలీదా... నీ ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ తోనే అన్నావు... గతంలో రాజకీయాల్లో ఉంటే వైఎస్‌ఆర్ సీపీలోనే ఉంటానన్నావు.. ఊసరవిల్లి కంటే వేగంగా మాటలు మారుస్తున్నావు. నువ్వేమో పవన్ తోనే ఉంటానని అంటున్నావు... పవన్ మాత్రం చంద్రబాబు తోనే ఉంటానంటాడు. నువ్వేమో గతంలో ఒంగోలులో టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానని అన్నావు. ఇంతకీ ఏం చేయబోతున్నావు. రాజకీయాలు చేస్తావా లేక పిఠాపురం సభలో చెప్పినట్టు పవన్ తో సినిమా తీసుకుంటావా’’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment