టెన్త్ పరీక్షల్లో ముగ్గురు ఇన్విజిలేటర్లు రిలీవ్
సింగరాయకొండ: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో బుధవారం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఇన్విజిలేటర్లను డీఈఓ కిరణ్‌కుమార్ రిలీవ్ చేశారు. సింగరాయకొండ మండలంలో నాలుగు కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలను డీఈఓ కిరణ్‌కుమార్ మధ్యాహ్నం సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వి.ఆనందరావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్.వెంకటేశ్వర్లు, మరో ఉపాధ్యాయుడు పరీక్ష విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించి విధుల నుంచి తప్పించారు.
రెండు ఆలయాల్లో చోరీ
● 3 సవర్ల బంగారం, 2 సీసీ కెమెరా డీవీఆర్ బాక్స్‌లు అపహరణ
టంగుటూరు: మండలంలోని వల్లూరులో రెండు ఆలయాల్లో మంగళవారం అర్ధరాత్రి దొంగలు తెగబడ్డారు. పోలీసుల కథనం మేరకు.. గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయం తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దొంగలు.. 3 గ్రాములకు పైగా బంగారు కాసులు, ఇత్తడి కిరీటం, సీసీ కెమెరా డీవీఆర్ బాక్స్ అపహరించారు. అలాగే శివాలయంలో సీసీ కెమెరాల డీవీఆర్ బాక్స్ ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై నాగమల్లీశ్వరరావు పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment