ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి
● జిల్లా పంచాయతీ అధికారి వెంకట నాయుడు
మద్దిపాడు: మండలంలోని అన్ని పంచాయతీల పరిధిలో ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అఽధికారి (డీపీఓ) జి.వెంకట నాయుడు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని ఇనమనమెళ్లూరు పంచాయతీని గురువారం ఆకస్మికంగా ఆయన సందర్శించారు. ఇంటి పన్నుల వసూళ్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. పంచాయతీలో ఇంకా వసూలు కావాల్సి ఉన్న 2.78 లక్షల రూపాయల పన్నులపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయ సిబ్బంది ఉదయం, సాయంత్రం, సెలవు దినాలలో ప్రజలకు అందుబాటులో ఉండి నూరుశాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకురావాలని చెప్పారు. వారంలో మూడు రోజుల పాటు ఐవీఆర్ సర్వే జరుగుతుందని, ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ పాజిటివ్‌గా ఉండేందుకు ప్రతిరోజూ గ్రామాల్లో చెత్త సేకరణ జరగాలని సూచించారు. పీఆర్‌ఒన్ యాప్‌లో టాస్క్‌లను వెంటనే పూర్తి చేసి గ్రామ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఈఓపీఆర్‌డీ రఘుబాబుతో డీపీఓ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో హౌస్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్‌లను నూరు శాతం వసూలు చేయాలని ఆదేశించారు.
ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి
Comments
Please login to add a commentAdd a comment