అప్పుల పాలు కావాల్సిందే | - | Sakshi
Sakshi News home page

అప్పుల పాలు కావాల్సిందే

Published Fri, Mar 21 2025 1:38 AM | Last Updated on Fri, Mar 21 2025 1:34 AM

అప్పు

అప్పుల పాలు కావాల్సిందే

19 ఎకరాల సొంత పొలం, 35 ఎకరాల కౌలుకు తీసుకున్న పొలంలో పొగాకు సాగు చేస్తున్నా. ఈ సంవత్సరం మల్లె తెగులు కారణంగా ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. సాగు ఖర్చులు కూడా గత సంవత్సరం ఎకరాకు రూ.1.50 లక్షలు అయితే ఈ సంవత్సరం రూ.2 లక్షలు అయింది. ఈ సంవత్సరం కేజీ ధర 400 రూపాయలు ఉంటే తప్ప కోలుకునే పరిస్థితి లేదు. ఆశించిన ధర లేకపోతే అప్పుల పాలు కావాల్సిందే.

– తాటికొండ రామచంద్రరావు,

పొగాకు రైతు, పచ్చవ

తగ్గిన దిగుబడి

నేను 11 ఎకరాల్లో పొగాకు సాగుచేస్తున్నా. గత సంవత్సరం ఎకరాకు 1.50 లక్షల రూపాయలు ఖర్చయితే.. ఈ సంవత్సరం 2 లక్షలు ఖర్చయింది. ప్రతి సంవత్సరం ఎకరాకు సుమారు 12 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈ సంవత్సరం కేవలం 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. కిలో ధర రూ.400 ఉండాలి. లేకపోతే నష్టాలు చవిచూడాల్సిందే.

– పాలడుగు జగదీష్‌,

పొగాకు రైతు, చిర్రికూరపాడు

No comments yet. Be the first to comment!
Add a comment
అప్పుల పాలు కావాల్సిందే 
1
1/1

అప్పుల పాలు కావాల్సిందే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement