హోరాహోరీగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
కొనకనమిట్ల: వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఉత్సవ సేవా కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి, మేకలవారిపల్లి రెడ్ల సంఘం పర్యవేక్షణలో 18వ పర్యాయం నిర్వహించిన ఎడ్ల పోటీలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఎడ్ల పోటీలను తిలకించేందుకు రైతులు, పశుపోషకులు భారీగా హాజరయ్యారు.
హోరాహోరీగా ఎడ్ల పందేలు
ఆరు పళ్ల సైజు ఎడ్ల బండలాగుడు పోటీల్లో మొత్తం 17 జతల ఎడ్లు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రకాశం, గుంటూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన గిత్తలు బండ లాగుతుండగా ప్రేక్షకులు ఈలలు, చప్పట్లు, కేరింతలతో ఉత్సాహపరిచారు. వ్యాఖ్యాత, రిఫరీగా వెంకటరామిరెడ్డి, నారాయణస్వామి వ్యవహరించారు. ప్రజలకు సత్రాల్లో భోజన వసతి సమకూర్చారు.
గరుడ వాహనంపై శ్రీవారు
శుక్రవారం వెలుగొండ తిరునాళ్ల కావడంతో భక్తులు పోటెత్తారు. శ్రీవారు గరుడ వాహనంపై శ్రీరామమూర్తి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని ప్రత్యేక పల్లకిపై ఊరేగించారు. భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఉభయదాతలుగా కూనపల్లి శేషఫణిశర్మ, ప్రసాదశర్మ, దూర్జటిశర్మ, వీరబద్రశర్మ, శ్రీకాంతశర్మ, రామచంద్రపవన్‌కుమార్, శాంతమూర్తి, జానకీరామ్ దంపతులు వ్యవహరించారు. ఈఓ చెన్నకేశవరెడ్డి్, సేవా కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం మోహినీ ఉత్సవం, గజోత్సవం, తినునాళ్ల, పగలు ఎడ్ల పందేలు, రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు.
హోరాహోరీగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
హోరాహోరీగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
Comments
Please login to add a commentAdd a comment