ముస్లింల అభ్యున్నతికి కృషి
యర్రగొండపాలెం: రాజకీయాలకు అతీతంగా ముస్లింల అభ్యున్నతికి సహకరిస్తానని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మాచర్ల రోడ్డులోని ముస్లిం షాదీ ఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. తన ప్రాణం ఉన్నంత వరకు సహాయం చేయడాన్ని ఆపేది లేదని, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ముస్లింలు తనకు ఎంతగానో సహకరించారని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలను పక్కనపెట్టి సమస్యలు పరిష్కరించేదుకు కృషి చేస్తానని, ఆశీస్సులు అందించాలని కోరారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాటలో పయనిస్తూ పేదల పక్షాన పోరాడతానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ మసీదుల ముల్లాలు, పెద్దలు హిదయతుల్లా, మొహమ్మద్, ఎస్.మజీద్, ఎం.కరీముల్లా బేగ్, సయ్యద్ జబీవుల్లా, సయ్యద్ మగ్బూల్‌బాష, షేక్.ఉస్మాన్, సయ్యద్ షాబీర్‌బాష, షేక్.బుజ్జి, షేక్.కాశిం, షేక్.వలి, ఏఒన్ గ్లోబల్ అధినేత మొగల్ షంషీర్‌అలిబేగ్, ఆదిత్య విద్యా సంస్థల అధినేత సూరె రమేష్, మదర్ థెరిసా విద్యా సంస్థల అధినేత బి.వెంకటేశ్వర్లు నాయక్, ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, వైఎస్సార్ సీపీ నాయకులు ఒంగోలు మూర్తిరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, కె.ఓబులరెడ్డి, కందూరి కాశీవిశ్వనాఽథ్, ఒ.సుబ్బారెడ్డి, ఎస్.ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, జి.వెంకటరమణారెడ్డి, పి.కృష్ణారెడ్డి, ఎం.సుబ్బారెడ్డి, ఎన్.వెంకటరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, ఎల్లేష్ యాదవ్, చంద్రకాంత్ నాయక్, ఎ.ఆదినారాయణ, ఎం.ఆదిశేషు, సూరె శ్రీనివాస్, కె.సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వైపాలెంలోని షాదీ ఖానాలో ఇఫ్తార్ విందుకు హాజరు
Comments
Please login to add a commentAdd a comment