సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
ఒంగోలు టౌన్: సైబర్ నేరాల కట్టడి విషయంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సైబర్ నేరాలపై పోలీసు సిబ్బందికి శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సైబర్ నేరాలపై ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, ఐటీ కోర్ సిబ్బంది అందించే శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయని, ఓటీపి నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ఉద్యోగాల పేరిట ప్రజలను మోసం చేయడం గురించి వివరించారు. మోసాలకు పాల్పడే నేరగాళ్లకు శిక్షలు పడేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. పిటిషన్ మేనేజ్‌మెంట్, ఎఫ్‌ఐఆర్ మేనేజ్‌మెంట్, స్టేషన్ మెనేజ్‌మెంట్, క్రిమినల్ ఇంటిలిజెన్స్‌లో మెళకువలను నేర్పించనున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలకు గురైన బాధితులు 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కంభం సీఐ మల్లికార్జునరావు, ఒంగోలు వన్‌టౌన్ సీఐ నాగరాజు, కొండపి సీఐ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దర్శి డీఎస్పీకి సేవా పురస్కారం
దర్శి: డీఎస్పీ లక్ష్మీనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ సేవా పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ సిబ్బంది ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఇలాంటి మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఐ రామారావు, ఎస్సైలు మురళీ, మల్లికార్జునరావు, ఏఎస్సైలు రాంబాబు, శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment