
అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్లక్రైం: ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవా రం సిరిసిల్లలోని ప్రధాన చౌరస్తాలను పరిశీలించారు. కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, గాంధీ, అంబేడ్కర్ చౌక్ వంటి ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లా కేంద్రంలో వాహనాల రద్దీ, ట్రా ఫిక్ నియంత్రణపై అవగాహనకు కలియతిరిగినట్లు స్థానికంగా చర్చ జరిగింది. జిల్లా కేంద్రంతోపాటు ధార్మిక ప్రాంతమైన వేములవాడలో నూ ట్రాఫిక్ అంశాలు, రోడ్ల విస్తరణ వంటి అ ంశాలపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నట్లు ప లువురు చర్చించుకున్నారు. స్థానికంగా పలు అంశాలను పోలీసులను అడిగినట్లు సమాచారం. ఎస్పీ వెంట సిరిసిల్ల టౌన్ సీఐ అనిల్‌కుమార్, ట్రాఫిక్ ఎస్సై రాజ్‌కుమార్ ఉన్నారు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి ఆకస్మిక మృతి
జగిత్యాల క్రైం: జగిత్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న షరాఫ్ రాంసింగ్(49) మంగళవారం జగిత్యాలలోని తన ఇంట్లోనే కుప్పకూలి, మృతిచెందాడు. గత కొంతకాలంగా ఆయన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రాంసింగ్ మృతికి సబ్ రిజిస్ట్రార్ కిషన్‌నాయక్, డాక్యుమెంట్ రైటర్లు రమేశ్, రామకృష్ణ, దామోదర్‌రెడ్డి, అశోక్, శంకర్‌రావు, మోహన్‌రావు, రాజశేఖర్ సంతాపం వ్యక్తం చేశారు.
రేషన్ బియ్యం పట్టివేత
జగిత్యాలక్రైం: కలెక్టర్ యాస్మిన్ బాషా ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు మంగళవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్ర ంలో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నిల్వ ఉ ంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నా రు. స్థానిక గంగిరెద్దుల కాలనీలో టేకుమల్ల భూలచ్చయ్య ఇంట్లో నిల్వ ఉంచిన 7 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి, యజమానిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధి కారి చందన్‌కుమార్ తెలిపారు. పట్టుకున్న బి య్యాన్ని మండలంలోని రేషన్ డీలర్ తిరునగి రి వేణుగోపాల్ వద్ద భద్రపర్చినట్లు పేర్కొన్నా రు. లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment