అంబులెన్స్ ఖర్చులు అందిస్తున్న ఆడెపు రవీందర్
సిరిసిల్లటౌన్: వలసవచ్చిన నిరుపేద నేతకారుడు అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. చేతిలో చిల్లిగవ్వలేని ఆ కుటుంబానికి సిరిసిల్లలోని మానవతావాదులు చేదోడుగా నిలిచారు. స్థానికుల వివరాల ప్రకారం మహారాష్ట్ర భీవండికి చెందిన గర్దాస్ కృష్ణ(39) పదకొండు నెలల క్రితం సిరిసిల్లకు వచ్చి అంబికానగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
సాంచాలు నడుపుతూ భార్య పుష్ప, ఎనమిదేళ్ల కొడుకును పోషిస్తున్నాడు. కొన్నాళ్లుగా మూర్చవ్యాధితో బాధపడుతున్నాడు. బుధవారం ఉదయం మూర్చరావడంతో జిల్లాసుపత్రికి భార్య తరలించింది. ఈసీజీ తీస్తున్న సమయంలో గుండెపోటుతో మృతిచెందాడు. చేతిలో చిల్లిగవ్వ లేని నిస్సాహాయ స్థితిలో భార్య, పిల్లలను చూసి బీజేపీ నేతలైన మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, ఉపాధ్యక్షుడు శీలం రాజు, గాజుల వేణు, రాజు తదితరులు చందాలు పోగు చేశారు. రూ.39వేలతో అంబులెన్స్ మాట్లాడి సొంతగ్రామానికి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment