బడిబయట ఉన్న పిల్లలను గుర్తించండి
సిరిసిల్లకల్చరల్: బడి బయట ఉన్న పిల్లల గుర్తింపు కోసం ప్రత్యేక సర్వే చేపట్టాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం విద్య, కార్మిక, శిశుసంక్షేమశాఖ, పోలీస్ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టనున్న సర్వేపై ప్రత్యేక సూచనలు చేశారు. పాఠశాలల్లో నెల రోజులకు మించి గైర్హాజరు ఉన్న విద్యార్థులను బడిబయట విద్యార్థులుగా గుర్తించాలన్నారు. 15 నుంచి 19 ఏళ్లలోపు విద్యార్థులను ఓపెన్‌స్కూల్‌లో చేరేలా ప్రోత్సహించాలన్నారు. జనవరిలో జరిగే సర్వేలో తల్లిదండ్రులు, అంగన్‌వాడీ టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులను భాగస్వాములను చేసుకోవాలన్నారు. గతేడాది 420 మంది బడిబయట విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, కార్మికశాఖాధికారి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.
కేంద్ర పథకాలపై అవగాహన
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ సంస్థ ద్వారా పరిశ్రమలకు అందిస్తున్న వివిధ పథకాలపై ఆ సంస్థ ఏడీ శివరాంప్రసాద్ టెక్స్‌టైల్స్ పార్కు యజమానులకు బుధవారం అవగాహన కల్పించారు. టెక్స్‌టైల్‌పార్కు క్లాత్ మాన్‌ఫ్యాక్చర్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నల్‌దాస్ అనిల్‌కుమార్, పార్కు అడ్మినిస్ట్రేటర్ ఎం.సాగర్, డీవో మొయిజుద్దీన్, పరిశ్రమల యజమానులు కళ్యాడపు సుభాష్, యెల్లె లక్ష్మీనారాయణ, కట్టెకోల శివశంకర్ తదితరలు పాల్గొన్నారు.
అప్రమత్తతతో టీబీని నివారించవచ్చు
వీర్నపల్లి(సిరిసిల్ల): టీబీ వ్యాధిని అప్రమత్తత, జాగ్రత్తలతో నివారించవచ్చని డీఎంహెచ్‌వో వసంతరావు సూచించారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లి పీహెచ్‌సీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. టీబీ గాలి, తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుందన్నా రు. డాక్టర్ విష్ణు మాట్లాడుతూ టీబీ వ్యాధి వచ్చి తగ్గిన వారి, టీబీ మందులు వాడుతున్న వారి కుటుంబ సభ్యులకు, దీర్ఘకాలిక షుగర్ వ్యాధిగ్రస్తులకు టీబీ పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. వైద్యులు బ్లెస్సీ, దివ్య, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ సారియా అంజుమ్, డాక్టర్ చిరంజీవి, సూపర్‌వైజర్లు బిగిందర్, మహిపాల్, నాగరాజు, పద్మ, ఏఎన్‌ఎంలు మంజుల, ఇందిర పాల్గొన్నారు.
మోటార్లకు విద్యుత్ కనెక్షన్ తొలగింపు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని జిల్లెల్ల గ్రామ గంగమ్మచెరువు(పెద్ద చెరువు)లో మోటార్లకు ఇచ్చిన విద్యుత్ కనెక్షన్లను బుధవారం తొలగించారు. ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ పెద్ద చెరువులో ఎలాంటి మోటార్లు పెట్టరాదన్నారు. మోటార్లు వాడుతున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేడు అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
సిరిసిల్లటౌన్: జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రాస్‌కంట్రీ పోటీలు గురువారం సిరిసిల్లలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిక్కాల రామారావు, జిల్లా జనరల్ సెక్రెటరీ బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. అండర్ 16, 18, 20 మెన్, ఉమెన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న 32 మంది క్రీడాకారులను నాగర్‌కర్నూల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు తహసీల్దార్ జారీచేసిన డేట్ ఆఫ్ బర్త్, పదోతరగతి సర్టిఫికెట్లు తీసుకొని రావాలని సూచించారు. వివరాలకు 79014 64456లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment