● ఎముకలు కొరికే చలిలోనూ జీవనపోరాటం ● అర్ధరాత్రి నుంచే విధుల్లోకి పారిశుధ్య కార్మికులు ● తెల్లవారుజామునే రోడ్లపైకి కూరగాయల వ్యాపారులు ● గుడ్‌మార్నింగ్ అంటూ పేపర్‌బాయ్స్ పలకరింపు ● గజగజమంటూనే వాకింగ్‌కు నగరవాసులు
సిరిసిల్లటౌన్: చలి భయపెడుతోంది. వెన్నుపూస వణుకుతోంది. సాయంత్రం అయితే శరీరాన్ని కోసేలా చలిగాలులు వీస్తున్నాయి. జిల్లా ప్రజలు ముసుగుతన్ని నిద్రిస్తున్న వేళ వారు విధుల్లో చేరుతున్నారు. పట్టణాన్ని పరిశుభ్రం చేయడంలో కొందరు.. పాలు సరఫరా చేసే వారు ఇంకొందరు.. ఇలా తమ జీవనపోరాటంలో చలిని సైతం లెక్కచేయడం లేదు. గజగజ వణుకుతూనే బతుకుబండిని లాగుతున్నారు. తీవ్ర చలిగాలులు వీస్తున్న వేళ ‘సాక్షి’ బృందం జిల్లా కేంద్రం సిరిసిల్లలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించింది. చలిని సైతం లెక్కచేయకుండా పలు వర్గాల ప్రజలు చేస్తున్న జీవనపోరాటం, వారు ఏమన్నారో పరిశీలిద్దాం.. – ఫొటోలు : వంకాయల శ్రీకాంత్, సాక్షి ఫొటోగ్రాఫర్
Comments
Please login to add a commentAdd a comment