మసకబారుతున్న బాల్యం
ఈ విద్యార్థి పేరు శివరాత్రి ప్రశాంత్. వేములవాడరూరల్ మండలం ఫాజుల్‌నగర్‌కు చెందిన ఇతను స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో పదోతరగతి చదువుతున్నాడు. ప్రశాంత్ నాన్న ఆంజనేయులు చనిపోయాడు. అమ్మ అమృత కూలీ పని చేస్తుంది. ఉపాధ్యాయులు బోర్డుపై ఏదైనా రాస్తే ప్రశాంత్‌కు కనిపించడం లేదు. దీంతో చదువులో వెనకబడిపోతున్నాడు.
ఇతను వేములవాడ రూరల్ మండలం వట్టెంలకు చెందిన ఆకాశ్. స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. అమ్మానాన్నలు వసంత, శంకర్ వ్యవసాయం చేస్తారు. ఆకాశ్ పుస్తకం చదువుతుంటే కళ్లలో నీళ్లు వచ్చి అక్షరాలు కనిపించడం లేదు. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి కంటి పరీక్షలు చేయించే ఆర్థిక స్థోమత తల్లిదండ్రులకు లేదు.
వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చిన వీరంతా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే బాలికలు. వీరిలో కొందరికి కంటి సమస్యలు ఉన్నాయి. పూర్తిస్థాయి పరీక్షల కోసం వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. వీరికి రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే)లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2,464 మంది పిల్ల లకు పరీక్షలు చేయగా, 1,456 మంది పిల్లల్లో కంటి సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు.
సిరిసిల్ల: ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాల్లో చదివే పిల్లలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రుల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ సాయంతో దృష్టిలోపాలను గుర్తించి చిన్నచిన్న సమస్యలు ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందిస్తున్నారు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే కంటి ఆపరేషన్ల కోసం హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి సిపార్సు చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్నవారు సిరిసిల్లలోని ఎన్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటున్నారు. కాగా, 15 ఏళ్లలోపు పిల్లల్లో కంటి సమస్యలు ఎక్కువగా రావడం ఆందోళన కలిగిస్తుంది.
సెల్ ఫోన్, టీవీల ప్రభావం
నిత్యజీవనంలో సెల్‌ఫోన్ భాగమైంది. ఈనేపథ్యంలో పిల్లలు గంటల తరబడి ఫోన్, టీవీలకు అతుక్కుపోవడంతో కంటి రెటీనాపై ప్రభావం పడి చూపు మందగిస్తుంది. కంటికి సంబంధించి అనేక సమస్యలు సెల్‌ఫోన్ చూడడం వల్ల వస్తున్నట్లు కంటి వైద్యనిపుణులు చెబుతున్నారు. టీవీలు, సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉన్న పిల్లల్లో పోషకాహార లోపాలతో కంటి జబ్బులు వస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు మధ్యతరగతి, పేదవర్గాలు కావడంతో వారిలో దృష్టిలోపాలను గుర్తించి ప్రైవేటుగా వైద్యం చేయించే ఆర్థిక స్థోమత వారిలో ఉండడం లేదు. ఫలితంగా పిల్లలు కళ్ల వెంట నీరు కారుతున్నా, దగ్గరి చూపు లేకపోయినా.. దూరం చూపు మందగించినా.. తరగతి గదిలో బ్లాక్‌బోర్డు కనిపించపోచయినా.. చదువులో వెనకబడుతూ ఉజ్వల భవిష్యత్‌ను కోల్పోతున్నారు. ఇలాంటి పిల్లల కోసం జిల్లా వ్యాప్తంగా ఆర్‌బీఎస్‌కే పథకంలో కంటి పరీక్షలు చేయడంతో వారిలో దృష్టిలోపాలు వెలుగుచూస్తున్నాయి.
కళ్ల వెంట నీళ్లు.. కనిపించని బోర్డులు పిల్లలకు కంటి సమస్యలు పరీక్షల్లో వెల్లడవుతున్న దృష్టిలోపాలు
పరీక్షలు కొనసాగుతున్నాయి
జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారం పిల్లలకు కంటి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 2,464 మంది విద్యార్థులకు పరీక్షలు చేశాం. అందులో 37 మందికి ఆపరేషన్లు అవసరమని హైదరాబాద్ సరో జినీదేవి కంటి ఆస్పత్రికి రెఫర్ చేశాం. జిల్లాలో పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు చేస్తాం.
– డాక్టర్ నయీమ్‌జహాన్‌షేక్,
ఆర్‌బీఎస్‌కే జిల్లా కో ఆర్డినేటర్
మసకబారుతున్న బాల్యం
మసకబారుతున్న బాల్యం
మసకబారుతున్న బాల్యం
మసకబారుతున్న బాల్యం
Comments
Please login to add a commentAdd a comment