సజినా (ఫైల్)
రంగారెడ్డి: నేపాల్ బాలిక అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన బిక్రం సప్‌కోట భార్య పిల్లలతో ఐదేళ్ల క్రితం తుక్కుగూడకు వలస వచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు.
ఈ నెల 4వ తేదీనా రాత్రి 10.45 గంటల సమయంలో అతని పెద్ద కుమర్తె సజినా సప్‌కోట (17) ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లింది. ఆమె ఎంతకి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గానీ 87126 62367 నంబర్‌లో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment