సాక్షి, సిటీబ్యూరో: నూతన సంవత్సర వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు, పార్టీలు, ఈవెంట్లలో మాదక ద్రవ్యాల వినియోగంపై నిఘా పెట్టేందుకు స్నిఫర్ డాగ్స్‌ను రంగంలోకి దింపనున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుధీర్ బాబు తెలిపారు. ఈ నెల 31 రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ రహదారులపై నిఘా పెట్టేందుకు ప్రత్యేకంగా నైట్ సూపర్‌విజింగ్ ఆఫీసర్లు (ఎన్‌ఎస్‌ఓ)ను నియమించినట్లు చెప్పారు. ముఖ్య మైన, సున్నితమైన ప్రాంతాలలో ట్రాఫిక్ జాంలు, రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా అదనపు బందోబస్త్‌తో పాటు ఈవ్ టీజర్లను పట్టుకునేందుకు షీ టీమ్స్ రంగంలోకి దింపన్నుట్లు పేర్కొన్నారు. ముందస్తు అనుమతి లేకుండా పార్టీలు, ఈవెంట్లను చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
రాచకొండ సీపీ సుధీర్ బాబు
Comments
Please login to add a commentAdd a comment