
పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి
షాద్‌నగర్: పెండింగ్‌లో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌రెడ్డి అన్నారు. బుధవారం జరిగిన శాసన మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా అయిన పాలమూరులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే సాగు, తాగునీటి సమస్య తీరుతుందని తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో సరిగా నిధులు కేటాయించలేదని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. షాద్‌నగర్ పరిధిలోని మొగిలిగిద్దను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని కోరా రు. వైద్య ఆరోగ్య శాఖలో 510 జీఓ ద్వారా నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. పాఠశాలల సమయానికి అనుగుణంగా బస్సులు నడిపించాలని, విద్యార్థులకు తగిన సదుపాయాలు కల్పించాలని కోరారు.
‘దేవుడు ఉన్నాడు జాగ్రత్త’ పుస్తకం అందజేత
మొయినాబాద్: ‘దేవుడు ఉన్నాడు జాగ్రత్త’ పుస్తకాన్ని రాసిన రచయిత ఎంవీఆర్ శాస్త్రి మొదటి పుస్తకాన్ని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సౌందరరాజన్‌కు అందజేశారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి బుధవారం చేరుకుని పుస్తకాన్ని బాలాజీ పాదాల వద్ద ఉంచారు. అనంతరం సౌందరరాజన్‌కు మొదటి పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ.. దేవాలయాల పరిరక్షణకోసం ఉద్యమాన్ని నడిపిన సౌందరరాజనే ఈ పుస్తకాన్ని రచించడానికి స్ఫూర్తి అని అన్నారు. అందుకే ఆయనకు మొదటి పుస్తకాన్ని అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకుడు రంగరాజన్ తదితరులు ఉన్నారు.
వంటా వార్పుతో నిరసన
ఇబ్రహీంపట్నం రూరల్: సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. అక్కడే వంట చేసి భోజనాలు చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలతో జాగ్రత్త
నందిగామ: సైబర్ నేరాలతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం అను మానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని శంషాబాద్ డీసీపీ రాజేష్ అన్నారు. మండల పరిధిలోని మోదళ్లగూడ శివారులోని సింబయాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు సైబర్ క్రైం గురించి బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట సైబర్ క్రైం గురించి, మోసాల గురించి వింటున్నామని అన్నారు. అలాంటి సైబర్ కేటుగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. గుర్తుతెలియని నంబర్లతో వచ్చే ఫోన్ కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీలు చెప్పొద్దని సూచించారు. ఓఎల్‌ఎక్స్, ఉద్యోగాలు ఇస్తామని, కస్టమర్ కేర్ నుంచి, ఫెక్ యాప్స్, డిజిటల్ అరెస్ట్, న్యూడ్ కాల్స్, మ్యాట్రీమోని నుంచి స్పామ్ బ్యాంకుల నుంచి వచ్చే ఫోన్‌లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ మోసపోయినట్లు తెలిస్తే వెంటనే 100 నంబర్‌కు గానీ లేదా 1930కు గానీ కాల్ చేసి చెప్పాలని వివరించారు. కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్ రావు, నందిగామ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, పోలీసు సిబ్బంది, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
మండలిలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి

పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి
Comments
Please login to add a commentAdd a comment